తెలంగాణలో ఇప్పటికే వచ్చే ఎన్నికలకై కసరత్తు ప్రారంభమైనదని చెప్పవచ్చు.ఇక కేవలం రెండున్నర సంవత్సరాలలోనే మరల సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇప్పటికే అంతర్గతంగా ప్రతి ఒక్క పార్టీ తమ కార్యాచరణను రూపొందించుకుంటున్న పరిస్థితి ఉంది.
ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారాలని భావిస్తున్న బీజేపీ క్షేత్ర స్థాయిలో క్యాడర్ నిర్మాణంపై పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది.బీజేపీ రాష్ట్ర స్థాయిలో కెసీఆర్ ను ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తూ ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచేందుకు ఎంతో కొంత ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ప్రస్తుతం బీజేపీ వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవాలన్నది ప్రధాన లక్ష్యంగా పని చేస్తోన్న పరిస్థితి ఉంది.
అయితే ముఖ్యంగా తెలంగాణలో 18 నుండి 35 ఏళ్ల వయస్సు కలిగిన యువకులపై బీజేపీ పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది.
కెసీఆర్ పై ప్రభుత్వంపై వ్యతిరేకతను నరనరాల్లో ఎక్కిస్తూ పెద్ద ఎత్తున యువకులలో కెసీఆర్ అంటే వ్యతిరేకత వచ్చే విధంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.దీంతో బీజేపీకి తాము అనుకున్న లక్ష్యం చాలా సులభంగా నెరవేరే అవకాశం ఉంది.
ఇక యువకులలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తే ఇక ప్రభుత్వం ఏం చేసినా కూడా పెద్దగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం లేదు.

అందుకే యువతపై పెద్ద ఎత్తున బీజేపీ ఫోకస్ పెట్టింది.అయితే సాధ్యమైనంత వరకు ఎక్కువ ఎమ్మెల్యేలను గెలుచుకుంటే టీఆర్ఎస్ ఓట్లను చీల్చాలన్నది బీజేపీ ప్రధాన వ్యూహం.మరి బీజేపీ అనుకున్న వ్యూహం, ప్రణాళిక ఫలిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.
అంతేకాక బీజేపీ కొంచెం మరింత దూకుడు రాజకీయం చేస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి కెసీఆర్ బీజేపీ దూకుడు రాజకీయాన్ని తనకు అనుగుణంగా ఎలా మలుచుకుంటారన్నది చూడాల్సి ఉంది.