కాళేశ్వ‌రం ప్రాజెక్టులో లోపాల‌పై టీజేఎస్ ర‌ణ‌దీక్ష‌

కాళేశ్వ‌రం ప్రాజెక్టు డిజైన్ లో లోపాలున్నాయ‌ని, నిర్మాణంలో అవినీతి జ‌రిగింద‌ని ఆరోపిస్తూ.తెలంగాణ జ‌న స‌మితి అధ్య‌క్షుడు ప్రొఫెస‌ర్.

 Tjs Campaign Against Defects In Kaleswaram Project Kaleswaram Project, Tjs , Ts Poltics , Kodanadaram-TeluguStop.com

కోదండ‌రామ్ ర‌ణ‌దీక్ష చేప‌ట్టారు.హైదరాబాద్ నాంప‌ల్లిలోని పార్టీ కార్యాల‌యంలో సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ఈ నిర‌స‌న దీక్ష కొన‌సాగ‌నుంది.

కాళేశ్వ‌రం వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవ‌డంలో ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని విమ‌ర్శించారు.ప్రాజెక్టు డిజైన్ లోపం వ‌ల్ల ప్ర‌జ‌లు తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని తెలిపారు.

కేసీఆర్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా స్పందించి బాధితుల‌ను ఆదుకోవాల‌ని, లేని ప‌క్షంలో ఉద్య‌మాన్ని తీవ్ర‌త‌రం చేస్తామ‌ని హెచ్చ‌రించారు.సంత‌కాల సేక‌ర‌ణ‌, విన‌తిప‌త్రాల స‌మ‌ర్ప‌ణ‌తో పాటు అవ‌స‌ర‌మైతే పాద‌యాత్ర కూడా చేప‌డతామ‌ని కోదండ రామ్ స్ప‌ష్టం చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube