భారత సంతతికి చెందిన ఉదయ్‌కుమార్ దక్షిణామూర్తి అనే వ్యక్తి 13 ఏళ్ల మైనర్ బాలికని 2016 నుంచీ లైంఘిక వేధింపులకి గురిచేస్తున్నాడని.ఆ బాలికని బలాత్కారం చేయబోయాడు అనే ఘటనలో దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు నేరం రుజువు చేయడంతో సింగపూర్ కోర్టు ఉదయ్ కుమార్ కి 13 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
13 ఏళ్ల మైనర్ బాలికని లైంఘికంగా హింసించడమే కాకుండా ఎన్నో రకాలుగా నరకం చూపించాడని ఆ బాలిక నగనంగా ఉన్న ఫోటోలు కూడా తీశారని పోలీసులు కోర్టుకు వివరించారు.దాంతో సింగపూర్ హైకోర్టు జ్యుడీషియల్ కమిషనర్ పాంగ్ కాంగ్ చౌ 13 ఏళ్ల బాలికని లైంఘిక ఇబ్బందులకి గురి చేసి హింస పెట్టిన కారణంగా ఉదయ్ కుమార్ కి 13 ఏళ్ల జైలు శిక్షని ఖరారు చేశారు.
ఇదిలాఉంటే ఈ కేసు తెరపైకి రావడానికి గల కారం ఏమిటంటే.మైనర్ బాలిక వద్ద ఉన్న ఫోన్‌లో ఆ పాప నగ్నంగా ఉన్న ఫోటోను దక్షిణామూర్తి వల్ల గర్భం దాల్చిన ఒక యువతి చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇక అక్కడితే ఉదయ్ తీగ లాగితే డొంక అంతా కదిలింది.