ట్రంప్ తలపెట్టాలని అనుకున్న మెక్సికో సరిహద్దుల వెంబడ గోడ నిర్మాణాన్ని డెమోక్రాటిక్ పార్టీ అడ్డుకోవడంతో తలెత్తిన గోడ వివాదం అమెరికా మొత్తం షట్ డౌన్ అయ్యేలా చేసింది.ఫెడరల్ ఉద్యోగులు ఎంతో మంది జీతాలు లేక పూట గడవని పరిస్థితికి వచ్చింది.
కొన్ని స్వచ్చంద సంస్థల సహకారంతో ఇప్పుడు వారికి భోజన సదుపాయం జరుగుతోంది.అయినా ఇన్ని పరిస్థితుల మధ్య కూడా ట్రంప్ తన పట్టు వదలడం లేదు.
ఈ క్రమంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బుష్.ఈ ఆర్ధిక సంక్షోభాన్ని పరిష్కరించాలని పిలుపు ఇచ్చారు.ఈ మేరకు జీతాలు చెల్లించని తన సీక్రెట్ సర్వీస్ అధికారులకి స్వయంగా బుష్ పిజ్జాలు పంపిణీ చేశారు.వేతనాన్ని ఆశించకుండా తమ దేశం కోసం కష్టపడి పనిచేస్తున్న ఫెడరల్, సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి ఏమి చేసినా తక్కువే అంటూ కితాబు ఇచ్చారు.
వారికి, వారి కుటుంభ సభ్యులకి కృతజ్ఞతలు తెలిపారు.
రెండు పార్టీలు విభేదాలు పక్కన పెట్టి షట్ డౌన్ కి ముగింపు పలకాలని ఆయన కోరారు.ఇదిలాఉంటే అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద షట్ డౌన్ గా నిలిచింది.దాదాపు 6 వేల సీక్రెట్ సర్వీస్ ఉద్యోగులు, 8లక్షల పెఢరల్ ఉద్యోగులకు జీతాలు లేక నానా అవస్థలు పడుతున్నట్టుగా తెలుస్తోంది.