తెలంగాణ శాసనసభలో బడ్జెట్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Mallu Bhatti Vikramarka ) మాట్లాడారు.కేటాయింపుల్లో సమన్యాయంతో సామాజిక న్యాయం చేశామని పేర్కొన్నారు.
తెలంగాణలో సామాజిక, ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.ఈ క్రమంలో రాష్ట్రంలో నెలకొన్న అసమానతలు తొలగించడానికి బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.
బడ్జెట్ లో కేటాయించిన ప్రతి రూపాయి ఖర్చు చేస్తామని పేర్కొన్నారు.అదేవిధంగా వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెట్టామని ఆయన వెల్లడించారు.
బడ్జెట్ కేటాయింపులు, వ్యయానికి ఐదు శాతం మించి తేడా లేకుండా చూడాలన్నారు.గత ప్రభుత్వం వాస్తవాలకు దూరంగా బడ్జెట్( Budget ) పెట్టింది.ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు అప్పులు చేయక తప్పట్లేదన్నారు.ఈ క్రమంలోనే రాష్ట్రంపై మొత్తం రూ.7.11 లక్షల కోట్ల అప్పుల భారం ఉందని తెలిపారు.అనంతరం బీఆర్ఎస్( BRS ) పై మండిపడిన భట్టి ప్రతిపక్ష నేతలు అన్నీ అబద్ధాలే చెబుతున్నారని విమర్శించారు.