జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేటులో ఏపీ అగ్రస్థానం

ఏపీ రాష్ట్రం వృద్ధి రేటులో దూసుకెళ్తోంది.జీఎస్టీ వసూళ్లలో టాప్ గా నిలిచిన ఏపీ రాష్ట్రం 12 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే మిగతా రాష్ట్రాల కన్నా ముందంజలో ఉంది.

 Ap Tops In Gst Growth In South India-TeluguStop.com

దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేటులో అగ్రస్థానంలో నిలిచాయి.

సాధారణంగా పాలకుడు బావుంటే ఎంతటి ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రం అయినా ప్రగతిపథంలో వెళ్తుంది.

ఇందుకు నిదర్శనంగా ఏపీ రాష్ట్రం నిలిచిందని చెప్పుకోవచ్చు.ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

పన్నుల ఆదాయం పెంపొందించుకుని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరుచుకునేందుకు దోహద పడుతుంది.

ఏపీలో వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత అమలు అవుతున్న వ్యాపార, వాణిజ్య మరియు పారిశ్రామిక విధానాలు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.

సులభతరమైన వాణిజ్య విధానాలను అమలు చేయడంతో పాటు దేశ, విదేశ పెట్టుబడులను ఆకర్షించడంలో వైఎస్ జగన్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం పరుగులు పెడుతోంది.ఈ క్రమంలోనే రాష్ట్రం సాధించిన ప్రగతి కేంద్రం విడుదల చేసిన పలు నివేదికల్లో ఇప్పటికే వెల్లడైన సంగతి తెలిసిందే.

తాజాగా 2023 అక్టోబర్ వరకు జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేటులో యావత్ దక్షిణాది రాష్ట్రాల మొత్తంలో ఏపీ, కర్ణాటక మాత్రమే అగ్రస్థానంలో నిలిచాయి.రాష్ట్ర విభజన అనంతరం ఏపీ జీఎస్టీ ఆదాయం 12 శాతం వృద్ధి రేటుతో రూ.18,488 కోట్లుగా ఉంది.ఇదే తరహాలో కర్ణాటక రాష్ట్రం కూడా 12 శాతం వృద్ధి రేటుతో ఏపీకి సమానంగా ఉంది.

ఇక మిగతా రాష్ట్రాలైన తెలంగాణ వృద్ధి రేటు 10 శాతం, తమిళనాడు 9 శాతం, కేరళ 5 శాతంగా నమోదు అయింది.

కాగా దేశ వ్యాప్తంగా అక్టోబర్ లో స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,72,003 కోట్లుగా ఉంది.మొత్తంలో రూ.30,062 కోట్లు సెంట్రల్ జీఎస్టీ, రూ.38,171 కోట్లు స్టేట్ జీఎస్టీ, రూ.91,315 కోట్లు ( వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ.42,127 కోట్లతో కలిపి) ఐజీఎస్టీ, రూ.12,456 కోట్లు (రూ.1,294 కోట్లతో సహా) వస్తువుల దిగుమతిపై వసూలు అయ్యాయి.ఈ నేపథ్యంలో మొత్తం మీద ఏపీ రాష్ట్రం పన్నుల ఆదాయంలో దూసుకుపోతుందని తెలుస్తోంది.దీనికి ప్రధాన కారణం వైఎస్ జగన్ సారధ్యంలోని ప్రభుత్వం చేపట్టిన పాలనా సంస్కరణలు, పారదర్శక విధానాలే కారణమని నిపుణులతో పాటు ఏపీ రాష్ట్ర ప్రజలు కూడా చెబుతుండటం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube