1.పెద్దపులి సంచారం
![Telugu Apcm, Ap, Bandi Sanjay, Bigg Boss, Buddha Venkanna, Cm Kcr, Corona, Khusb Telugu Apcm, Ap, Bandi Sanjay, Bigg Boss, Buddha Venkanna, Cm Kcr, Corona, Khusb](https://telugustop.com/wp-content/uploads/2022/10/kaagaz-nagar-tiger-found.jpg )
తెలంగాణలోని కొమరం భీం జిల్లాలోని కాగజ్ నగర్ అటవీ డివిజన్ లోకి కొత్తగా వచ్చిన పెద్దపులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తుంది.పులి దాడిలో వారంలో ఎనిమిది పశువులు మృత్యువాత పడ్డాయి.
2.రాహుల్ పాదయాత్ర ప్రారంభం
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నారాయణపేట జిల్లా, ఎలిగండ్ల నుంచి ప్రారంభం అయ్యింది.
3.ఓబీసీ కుల గణన పై రాహుల్ స్పందించాలి
![Telugu Apcm, Ap, Bandi Sanjay, Bigg Boss, Buddha Venkanna, Cm Kcr, Corona, Khusb Telugu Apcm, Ap, Bandi Sanjay, Bigg Boss, Buddha Venkanna, Cm Kcr, Corona, Khusb](https://telugustop.com/wp-content/uploads/2022/10/jajula-srinivas-goud.jpg )
ఓబిసి కుల గణన పై కాంగ్రెస్ వైకరని రాహుల్ గాంధీ ప్రకటించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జుజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
4.ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై టీఆర్ఎస్ ఆగ్రహం
టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనుగోలుకు బిజెపి ప్రయత్నించిందని ఆరోపిస్తూ, తెలంగాణ వ్యాప్తంగా టిఆర్ఎస్ శ్రేణులు బిజెపి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
5.తెలంగాణ వ్యాప్తంగా బిజెపి ఆందోళనలు
![Telugu Apcm, Ap, Bandi Sanjay, Bigg Boss, Buddha Venkanna, Cm Kcr, Corona, Khusb Telugu Apcm, Ap, Bandi Sanjay, Bigg Boss, Buddha Venkanna, Cm Kcr, Corona, Khusb](https://telugustop.com/wp-content/uploads/2022/10/bjp-protests-in-telangana.jpg )
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో చోటు చేసుకున్న ఘటన కు వ్యతిరేకంగా బిజెపి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి.
6.రఘురామ కామెంట్స్
రైతుల పాదయాత్ర పై వైసీపీ ప్రభుత్వం వ్యూహం పన్నిందని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురాం కృష్ణంరాజు విమర్శించారు.
7.విజయ సాయి రెడ్డి పై బుద్ధ వెంకన్న కామెంట్స్
![Telugu Apcm, Ap, Bandi Sanjay, Bigg Boss, Buddha Venkanna, Cm Kcr, Corona, Khusb Telugu Apcm, Ap, Bandi Sanjay, Bigg Boss, Buddha Venkanna, Cm Kcr, Corona, Khusb](https://telugustop.com/wp-content/uploads/2022/10/vijayasai-reddy-buddha-venkanna.jpg )
విశాఖలో భూ దోపిడీకి హత్య లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని టిడిపి కీలక నేత బుద్ధ వెంకన్న విమర్శించారు.
8.అనకొండ నోట్లో ఋషికొండ
అనకొండ నోట్లో రిషికంగా ఉంది అంటూ ఉత్తరాంధ్ర పోరు బాటలో భాగంగా ఋషి కొండ వద్ద టీడీపీ నిరసన కు దిగింది.
9.చంద్రబాబుపై సోము వీర్రాజు కామెంట్స్
![Telugu Apcm, Ap, Bandi Sanjay, Bigg Boss, Buddha Venkanna, Cm Kcr, Corona, Khusb Telugu Apcm, Ap, Bandi Sanjay, Bigg Boss, Buddha Venkanna, Cm Kcr, Corona, Khusb](https://telugustop.com/wp-content/uploads/2022/10/chandrababu-somu-veerraju.jpg )
అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం అప్పటి టిడిపి అధినేత చంద్రబాబు ప్రభుత్వానికి కేంద్రం 6,500 కోట్లు ఇచ్చిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కామెంట్ చేశారు.
10.రెండవ రోజు బుద్ధ వెంకన్న నిరసన దీక్ష
రెండో రోజు టిడిపి కీలక నేత బుద్ధ వెంకన్న నిరసన దీక్షకు దిగారు.నిన్న విశాఖకు బయలుదేరిన టిడిపి నాయకులను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఆయన దీక్షకు దిగారు.
11.బిగ్ బాస్ పై కేంద్రం స్పందించాలి
![Telugu Apcm, Ap, Bandi Sanjay, Bigg Boss, Buddha Venkanna, Cm Kcr, Corona, Khusb Telugu Apcm, Ap, Bandi Sanjay, Bigg Boss, Buddha Venkanna, Cm Kcr, Corona, Khusb](https://telugustop.com/wp-content/uploads/2022/10/bigg-boss-ap-high-court.jpg )
బిగ్ బాస్ షో పై వ్యక్తం అవుతున్న అభ్యంత్రాలపై దాఖలైన పిటిషన్ పై ఏపీ హై కోర్ట్ స్పందించింది.ఈ వ్యవహారంపై కేంద్రం స్పందించాలని నోటీసులు జారీ చేస్తూ విచారణ ను రెండు వారాల పాటు వాయిదా వేసింది.
12.కాకినాడలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ప్రారంభం
కాకినాడలో జాతీయ విద్యా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ను కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్ , పీయూష్ గోయల్ ప్రారంభించారు.
13.అచ్చెన్న నాయుడు కామెంట్స్
![Telugu Apcm, Ap, Bandi Sanjay, Bigg Boss, Buddha Venkanna, Cm Kcr, Corona, Khusb Telugu Apcm, Ap, Bandi Sanjay, Bigg Boss, Buddha Venkanna, Cm Kcr, Corona, Khusb](https://telugustop.com/wp-content/uploads/2022/10/atchennaidu-comments-1.jpg )
ఉత్తరాంధ్ర సమస్యలపై ఈనెల 28 నుంచి చేపట్టనున్న పోరుబాట కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం చూస్తోందని టిడిపి ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్న నాయుడు కామెంట్ చేశారు.
14.తిరుమల సమాచారం
నవంబర్ 1 నుంచి సర్వ దర్శనం టోకెన్లను జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
15.రాయలసీమకు ద్రోహం చేయవద్దు
![Telugu Apcm, Ap, Bandi Sanjay, Bigg Boss, Buddha Venkanna, Cm Kcr, Corona, Khusb Telugu Apcm, Ap, Bandi Sanjay, Bigg Boss, Buddha Venkanna, Cm Kcr, Corona, Khusb](https://telugustop.com/wp-content/uploads/2022/10/mla-bhumana-karunakar-reddy.jpg )
వైసిపి ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులు నిర్ణయాన్ని ఎవరు అడ్డుకోవద్దని , ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రాయలసీమ అభివృద్ధి చెందదని తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు ఈ మేరకు రాయలసీమ గర్జన ఫ్లెక్సీలను ఆయన ఆవిష్కరించారు.
16.కెసిఆర్ పై కిషన్ రెడ్డి కామెంట్స్
వేరే పార్టీలకు చెందిన శాసనసభ్యులను కెసిఆర్ తమ పార్టీలో చేర్చుకుని వారికి పదవులు ఇచ్చారని, దేశంలోని ఇలాంటి ముఖ్యమంత్రి ఉండరు అంటూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
17.దేవదాయ శాఖ ఈవో స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు విడుదల
![Telugu Apcm, Ap, Bandi Sanjay, Bigg Boss, Buddha Venkanna, Cm Kcr, Corona, Khusb Telugu Apcm, Ap, Bandi Sanjay, Bigg Boss, Buddha Venkanna, Cm Kcr, Corona, Khusb](https://telugustop.com/wp-content/uploads/2022/10/endowment-dept-eo-screening-results.jpg )
దేవదాయ శాఖ ఈవో స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.
18.కుష్బూపై డిఎంకెనేత కామెంట్స్
సినీ నటి, బిజేపి నేత కుష్బూ పై డీఎంకే నేత సైదయ్ సాధిక్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.కుష్బూ పెద్ద ఐటెం అంటూ వ్యాఖ్యానించారు.
19.యాదగిరి గుట్టలో బండి సంజయ్
![Telugu Apcm, Ap, Bandi Sanjay, Bigg Boss, Buddha Venkanna, Cm Kcr, Corona, Khusb Telugu Apcm, Ap, Bandi Sanjay, Bigg Boss, Buddha Venkanna, Cm Kcr, Corona, Khusb](https://telugustop.com/wp-content/uploads/2022/10/bandi-sanjay-yadagiri-gutta.jpg )
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ యాదగిరిగుట్టకు చేరుకున్నారు.ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా కుట్ర బయట పెట్టేందుకు శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంకు సంజయ్ చేరుకున్నారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,100 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,380
.