1. హైదరాబాద్ కు చేరిన కరోనా వ్యాక్సిన్
కరోనా వ్యాక్సిన్ హైదరాబాద్ కు చేరుకుంది పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్ నుంచి బయలుదేరిన విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయింది.31 బాక్సుల్లో, 3.72 లక్షల డోసుల వ్యాక్సిన్ తీసుకొచ్చారు.
2.అఖిల ప్రియ ప్రశ్నిస్తున్న డిసిపి

కిడ్నాప్ కేసు విషయమై కస్టడీలో ఉన్న భూమా అఖిలప్రియ ను డీసీపీ కమలేశ్వర్ విచారిస్తున్నారు.
3.తాగునీటి పథకం ప్రారంభం
జిహెచ్ఎంసి పరిధిలో ఉచిత తాగునీటి పథకం ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
4.తెలంగాణలో కరోనా

గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 301 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
5.14 నుంచి ఓపెన్ స్కూల్ ప్రయోగ పరీక్షలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ సెకండరీ, సీనియర్ సెకండరీ పరీక్షల షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.ప్రాక్టికల్ పరీక్షలు ఈనెల 14 నుంచి 25 వరకు జరుగుతాయి.
6.గవర్నర్ తో ముగిసిన ఎస్ ఈసీ భేటీ

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఎస్సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటి ముగిసింది.గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తాజాగా జరిగిన పరిణామాలపై చర్చించినట్టు తెలుస్తోంది.అలాగే ఏ ఉద్దేశంతో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాను అనే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు.
7.చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు
చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లె మండలం ఏనుగుల గుంపు సంచారం కలకలం రేపుతోంది.నెల్లిపట్ల అటవీ ప్రాంతంలో 14 ఏనుగుల గుంపు సంచరిస్తోంది.
8.పులిని బంధించేందుకు ఏర్పాట్లు

కొమరం భీమ్ జిల్లా బెజ్జూర్ మండలం కంది భీమన్న అటవీ ప్రాంతంలో పులి పట్టుకునేందుకు అటవీశాఖ ఎర వేసిన పశువును పులి హతమార్చింది.మళ్ళీ అక్కడికి వస్తుందనే ఉద్దేశంతో పులికి మత్తు మందు ఇచ్చి బంధించేందుకు అన్ని ఏర్పాట్లు అటవీశాఖ అధికారులు పూర్తిచేశారు.
9.గో మహా యాత్ర
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ,అక్రమ కబేళను మూసివేయాలని డిమాండ్ చేస్తూ , ఈ నెల 24 న గో మహా యాత్రను పడుతున్నామని యుగతులసి ఫౌండేషన్ చైర్మన్, టిటిడి బోర్డు సభ్యుడు కొలిశెట్టి శివకుమార్ తెలిపారు.
10.తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో శ్రీ సాయి గ్లోబల్ హరతి

గత నెల పదో తేదీన జరిగిన శ్రీ సాయి గ్లోబల్ హారతి కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేసినట్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్య నిర్వాహక అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు
11.షిరిడి దర్శనానికి ఆన్లైన్ టికెట్ తప్పనిసరి
జనవరి 14 నుంచి శిరిడి సాయిబాబా ఆలయానికి వచ్చే భక్తులు ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకుని రావాలని షిరిడి ట్రస్ట్ ప్రకటించింది.ఆన్లైన్ టికెట్ లేకుండా వస్తే దర్శనం ఉండదని స్పష్టం చేసింది.
12.బిజెపి నేతల పై పోలీసులు లాఠీఛార్జి

తెలంగాణలోని జనగామ జిల్లాలోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట బిజెపి నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.దీంతో ఆందోళన చేస్తున్న బిజెపి నాయకులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు.
13.ఢిల్లీకి చేరుకున్న కొవి షీల్డ్ వాక్సిన్
కొవిడ్ వ్యాక్సిన్ కోవి షీల్డ్ తొలి బ్యాచ్ ఢిల్లీ కి చేరుకుంది.పూణే నుంచి బయలుదేరిన సరుకు మంగళవారం ఉదయం ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.
14.బైడన్ ప్రమాణ స్వీకారం ఎమర్జెన్సీ విధించిన ట్రంప్

ఎస్బిఐ హెచ్చరికల నేపథ్యంలో వాషింగ్టన్ లో రెండు వారాల పాటు ఎమర్జెన్సీ విధించారు.అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ట్రంప్ వాషింగ్టన్ లో ఎమర్జెన్సీ విధించారని వైట్ హౌస్ ప్రెస్ ఆఫీస్ వెల్లడించింది.
15.రైతు సమస్యల పరిష్కారానికి కమిటీ
కొత్త సాగు చట్టాలపై ఉద్యమిస్తున్న రైతు సమస్యల ను కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
16.చైనాలో వేగంగా విస్తరిస్తున్న కరోనా

చైనాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది.సోమవారం 103 కేసులు నమోదు కాగా , మంగళవారం 55 కి పైగా కేసులు నమోదు అయినట్టు అక్కడి అధికారులు తెలిపారు.
17.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 12,584 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
18.కరోనా టీకా రెండో డోసు తీసుకున్న బైడన్

అమెరికా అధ్యక్షుడు గా ఎన్నికైన జో బైడన్ కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు.
19.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,580
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,310
20.రాజీనామా కు ట్రంప్ ససేమిరా

స్వపక్ష విపక్ష ల నుంచి రాజీనామా డిమాండ్లు సత్కారాలు ఎదురవుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం శ్వేత సౌదన్ని వదిలి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు.