పుష్ప 2 లో ఆయన కూడా..!

సుకుమార్, అల్లు అర్జున్ పుష్పతో నేషనల్ వైడ్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు.ప్రస్తుతం పుష్ప 2 ని సిద్ధం చేస్తున్నాడు సుకుమార్.

 Another Super Actor In Pushpa 2 , Pushpa 2, Jagapathi Babu , Sunil, Sukumar-TeluguStop.com

ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి కాగా మరో షెడ్యూల్ కు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్.ఈ సినిమా నుంచి ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఇక లేటెస్ట్ గా పుష్ప 2లో మరో నటుడు కూడా ఉంటాడని లీక్స్ వస్తున్నాయి.అతను ఎవరో కాదు సుకుమార్ నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలో నటించిన జగపతి బాబు.

పుష్ప 2 లో జగపతి బాబుకి మంచి పాత్ర రాశాడట సుక్కు.

పుష్ప 1లో ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు కానీ పార్ట్ 2 లో ఫాహద్ తో పాటుగా మరో బలమైన విలన్ ఉండాలని సునీల్ కి జతగా జగపతి బాబుని కూడా దించుతున్నాడట సుకుమార్.మొత్తానికి సుకుమార్ సినిమాలో జగపతి బాబు మరోసారి మంచి పాత్రలో కనిపించనున్నారు.ఇక పుష్ప 2 మీరు ఎంత ఊహించుకున్నా దానికి మించి ఉంటుందని చెబుతున్నారు చిత్రయూనిట్.

పుష్ప 2ని కూడా సుకుమార్ ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2 కోసం బాలీవుడ్ ఆడియన్స్ కూడా చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారని తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube