నా తొత్తర వల్లే ఎన్టీయార్ తో సినిమా చేయలేక పోయాను అంటున్న అనిల్ రావిపూడి...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకి చాలా మంచి గుర్తింపైతే ఉంది.ఎందుకంటే వాళ్ళు చేసే సినిమాలు సగటు ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటూ ఉంటాయి.

 Anil Ravipudi Says That I Could Not Do A Film With Ntr Because Of My Fear , Ntr,-TeluguStop.com

ఇక ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేయకుండా సేఫ్ జోన్ లో సినిమాలను చేసి స్టార్ హీరోలతో అవకాశాలను అందుకుంటున్న వారు కూడా కమర్షియల్ డైరెక్టర్లే కావడం విశేషం… ఇక ఇలాంటి సందర్భంలోనే అనిల్ రావిపూడి( Anil Ravipudi ) లాంటి కమర్షియల్ డైరెక్టర్ వరుసగా 8 విజయాలను సొంతం చేసుకుని తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు.ప్రస్తుతం ఆయన చిరంజీవితో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

మరి ఇలాంటి సందర్భంలోనే పటాస్ సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత ఆయన ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాల్సి ఉందట.నిజానికి ఎన్టీఆర్ కూడా అతనితో ఒక సినిమా చేయాలనే ప్రణాళికలు రూపొందించాడు.

 Anil Ravipudi Says That I Could Not Do A Film With NTR Because Of My Fear , NTR,-TeluguStop.com

కానీ అనిల్ రావిపూడి ఎన్టీఆర్ కోసం వెయిట్ చేయకుండా ‘సుప్రీమ్’ ( Supreme ) అనే సినిమా స్టోరీని రాసుకొని సాయి ధరంతేజ్ ( Sai Dharam Tej )తో ఆ సినిమాని తెరకెక్కించాడు.ఇక దాంతో అప్పటినుంచి ఎన్టీఆర్ ( NTR ) డైరీ అయితే ఖాళీ లేకుండా అయిపోయింది.

రెండోవ సినిమా కే ఎన్టీయార్ తో సినిమా చేయడానికి అవకాశం వచ్చిందని కొద్ది రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుందని చెప్పడంతో పెద్ద హీరోల సినిమాలకు చిన్న డైరెక్టర్లను వెయిట్ చేయిస్తూ ఉంటారు.

ఫైనల్ గా సినిమా ఉంటుందో ఉండదో అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది.

కాబట్టి నేను కూడా అదే ధోరణిలో ఆలోచించి ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందో ఉండదో ఇక్కడ టైమ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని నా తొత్తర వల్ల నేను సాయి ధరమ్ తేజ్ తో సుప్రీమ్ అనే సినిమా చేశాను అంటూ అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూ లో తెలియజేశాడు.

Telugu Anil Ravipudi, Anilravipudi, Supreme, Telugu-Movie

ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ చాలా బిజీ అయిపోవడంతో మళ్ళీ మా కాంబినేషన్ అయితే వచ్చే అవకాశం లేకుండా పోయింది ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియాలో తనకంటూ ఒక సత్తా చాటే ప్రయత్నంలో ఉన్నాడు.కాబట్టి ఇప్పుడు ఆయనతో నేను సినిమాలు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అంటూ అనిల్ రావిపూడి చెప్తూ ఉండడం విశేషం.

Telugu Anil Ravipudi, Anilravipudi, Supreme, Telugu-Movie

మరి ఏది ఏమైనా కూడా ఎన్టీఆర్ లాంటి ఒక స్టార్ హీరో తో అవకాశం వచ్చినప్పుడు ఆయన కోసం వెయిట్ చేయకుండా చిన్న హీరోలతో సినిమాలు చేసుకుంటూ రావడం పట్ల అనిల్ రావిపూడి కూడా కొంచెం రిగ్రెట్ ఫీల్ అయినట్టుగా తెలియజేశాడు.మరి ఏది ఏమైనా కూడా ఎన్టీఆర్ తో అవకాశం వస్తే మాత్రం మంచి స్టోరీ తో సినిమా చేస్తాను అంటూ ఆయన చెబుతూ ఉండటం విశేషం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube