ఒక కుటుంబం తమ కుమార్తెకు ఆరోగ్యం బాగాలేని కారణంగా ఓ మందిరానికి వెళ్ళింది.అయితే ఓ మాంత్రికుడు తమ కుమార్తెను ఎక్కడికి తీసుకు వెళ్లిన రోగం నయం కాదని, మీ ఇంట్లో కోట్ల రూపాయల విలువ చేసే వజ్ర వైఢూర్యాలు ఉన్నాయని, మీ కూతురి శరీరంలో ధనపిశాచి ప్రవేశించిందని ఆ మాంత్రికుడు నమ్మకపు మాటలు చెప్పి దారుణంగా మోసం చేసిన ఘటన చిత్తూరు జిల్లా( Chittoor )లోని పలమనేరులో చోటుచేసుకుంది.
అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.పలమనేరు అర్బన్ సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.
పలమనేరు పట్టణంలోని గంటావూరు కాలనీలో సయ్యద్ భాష అనే వ్యక్తి నివసిస్తున్నాడు.సయ్యద్ భాష కుమార్తెకు గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగాలేదు.
తెలిసినవారు గాలి సోకిందేమో అని చెప్పడంతో మదనపల్లి సమీపంలోని యాతాళవంక వద్ద ఉండే దర్గాకు ఈనెల 1వ తేదీన వెళ్లారు.అక్కడ సయ్యద్ భాష భార్యకు దూరపు బంధువైన అజీజ్ ఆలీ కనిపించి ఏమయిందని పలకరించాడు.
తమ కుమార్తెకు ఆరోగ్యం బాగాలేదు అనే విషయం అజీజ్ కు వారంతా తెలిపారు.అప్పుడు అజీజ్ తనకు తెలిసిన స్నేహితుడికి చూపిస్తే ఎటువంటి రోగం అయిన నయం చేస్తాడని తాను అతనిని గంటావూరు కు తీసుకువస్తానని తెలిపాడు.

తరువాత మదనపల్లి కు చెందిన రెడ్డి నరసింహులు, అజీజ్ అలీ వారి ఇంటికి వెళ్లి వారి కుమార్తెను పరిశీలించి ఇంట్లో భారీగా వజ్ర వైడూర్యాలు ఉన్నాయని, ధనపిశాచి మీ కుమార్తెను పట్టుకుందని, ఇందుకు విరుగుడుగా ఒక మంచి ముహూర్తం చూసి ఇంట్లో ఉండే వజ్రాలను వెలికి తీసి అందులోంచి ఒక వజ్రాన్ని మీ కుమార్తెకు ఉంగరంగా తొడగాలని చెప్పారు.

ఈనెల 18న అమావాస్య రోజు సయ్యద్ భాష ఇంటిలో ఉండే బెడ్రూంలో ఐదు అడుగుల గోవ్విని తీసి ఇద్దరు ఏవో పూజలు చేశారు.కాసేపటి తర్వాత రెండు విలువైన వజ్రాలు దొరికాయని నమ్మించి నకిలీ వజ్రాలను సయ్యద్ భాషకు ఇచ్చారు.పూజ ఖర్చు కోసం రూ.20 వేల రూపాయలు తీసుకున్నారు.అయితే గోతిని ఇంకాస్త లోతుకు తవ్వాలని అందుకు మరింత ఖర్చు అవుతుందని తెలిపారు.
చుట్టుపక్కల వారికి సయ్యద్ బాషా ఇంట్లో ఏదో జరుగుతుంది అని అనుమానం కలిగింది.మరొకవైపు సయ్యద్ భాషకు కూడా వీరిపై అనుమానం కలగడంతో బుధవారం పోలీసులను ఆశ్రయించి జరిగిందంతా తెలిపాడు.
గురువారం రాత్రి రెడ్డి నరసింహులు, అజీజ్ అలీ పలమనేరులోని సయ్యద్ బాషా ఇంటికి రాగానే పోలీసులు అరెస్టు( Police ) చేసి విచారించగా నకిలీ వజ్రాలతో మోసం చేసినట్లు అంగీకరించారు.