అసలు సినిమాలంటేనే ఇష్టం లేని పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సన్యాసం తీసుకుందాం అని ఫిక్స్ అయిన పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫోర్స్ వల్లే ఇండస్ట్రీ కి వచ్చి ఇక్కడ టాప్ హీరో గా ఎదిగారు…ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏ హీరో కి లేని గుర్తింపు ను తెచ్చుకున్నారు… అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమై ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు వంటి సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ తెచ్చుకున్నా విషయం మనకు తెలిసిందే… అయితే ఈయన చేసిన తొలిప్రేమ సినిమా( Tholiprema Movie ) అప్పటి వరకు ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా కావడం వల్ల ఆ తర్వాత మళ్లీ అంతటి హిట్ సినిమా ఎప్పుడు వస్తుందా అని అనుకున్నారు కానీ ఆయన కి ఆ తరవాత సినిమా అయిన తమ్ముడు( Tammudu ) సినిమాతోనే ఆ హిట్ సొంతం అయింది… అయితే తమ్ముడు సినిమాలో ఒక సన్నివేశం అచ్చం పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లో కూడా జరిగిందట.మరి ఆ సన్నివేశం ఏంటంటే…
పవన్ కళ్యాణ్ సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ కిక్ బాక్సింగ్ నేర్చుకోవడానికి రాత్రి మొత్తం వర్షంలో తడుస్తూ తనకి కిక్ బాక్సింగ్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో సింబాలిక్ గా మాస్టర్ కి చూపిస్తారు.
అయితే అసలు విషయంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లో కూడా ఇలాగే జరిగిందట.చెన్నైలోని కరాటే మాస్టర్ షెహాని హుస్సేన్( Karate Master Shihan Hussaini ) దగ్గర కరాటే నేర్చుకుంటానని పవన్ కళ్యాణ్ వెళితే ఇప్పుడు నేను ఖాళీగా లేను…

అలాగే నేను ఈ మధ్యకాలంలో కరాటే నేర్పించడం మానేశాను అని వెళ్లిపోమన్నారట.కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నేర్చుకుంటే మీ దగ్గరే నేర్చుకుంటాను అని చెప్పి పట్టుబట్టి మరి కూర్చున్నారట.అయితే పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు విన్న షహాని గారు ఓ రోజు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి మార్నింగ్ 5:00 నుండి నైట్ 11:00వరకు నా దగ్గరే ఉండు నేను ఖాళీగా ఉన్న టైంలో ఒక అర్థగంట నీకు కరాటే నేర్పిస్తాను అని చెప్పారట…

దాంతో ఆయన మాటలు విన్న పవన్ కళ్యాణ్ దొరికిందే చాన్స్ అనుకోని ఆయన చెప్పినట్లే ఒక 15 రోజుల పాటు మార్నింగ్ నుండి నైట్ వరకు ఆయన దగ్గరే ఉండి అన్ని పనులు చేసుకునే వారట.అయితే పవన్ కళ్యాణ్ డెడికేషన్ చూసిన షహాని మాస్టర్ పవన్ కళ్యాణ్ కి సంవత్సరం పాటు కోచింగ్ ఇచ్చారు.అలా ఆయన శిక్షణలో బ్లాక్ బెల్ట్ పొందారు పవన్ కళ్యాణ్.
కానీ ఆ తర్వాత కొన్ని నెలలకు షహాని గారికి కళ్యాణ్ ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అని తెలిసింది…ఇక తమ్ముడు సినిమా తర్వాత చేసిన బద్రి సినిమాతో( Badri Movie ) కూడా పవన్ కళ్యాణ్ మరో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు.ఇక పవన్ కళ్యాణ్ కెరియర్ మొదట్లో ఇలా వరుసగా 7 హిట్ సినిమాలు అందుకున్నారు… అందులో తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి లాంటి సినిమా లు ఆయన కెరియర్ లో ఇప్పటికీ బిగ్గెస్ట్ హిట్ సినిమాల లిస్ట్ లో ఉన్నాయి…
.







