పౌరసత్వ చట్టంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Amit Shah ) కీలక వ్యాఖ్యలు చేశారు.లోక్ సభ ఎన్నికలకు( Lok Sabha elections ) ముందే పౌరసత్వ చట్టం అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు.
ఢిల్లీలో నిర్వహించిన ఎకనామిక్ టైమ్స్ సదస్సులో అమిత్ షా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఏఏ చట్టాన్ని( CAA Act ) డిసెంబర్ 2019లో పార్లమెంట్ ఆమోదించిందని, సీఏఏ ఎవరి పౌరసత్వాన్ని హరించదని పేర్కొన్నారు.
ఇది బంగ్లాదేశ్, పాక్( Bangladesh, Pakistan ) సహా ఇతర దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం అందించే చట్టమని తెలిపారు.అనంతరం ఏపీలో పొత్తులపై మాట్లాడిన అమిత్ షా పొత్తులపై ఇప్పుడే ఏం మాట్లాడలేమని తెలిపారు.త్వరలోనే ఎన్డీఏ( NDA )లోకి కొత్త మిత్రులు వస్తున్నారని స్పష్టం చేశారు.