టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ చందమామ కాజల్ అగర్వాల్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు స్టార్ హీరోలు అందరితో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
స్టార్ హీరోలతో మాత్రమే కాదు చిన్న హీరోలతో, సీనియర్ హీరోలతో కూడా వరస అవకాశాలు అందుకుంటూ కుర్ర భామలకు పోటీ ఇస్తుంది.ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్దం పైగానే అవుతున్నా కూడా మొన్నటి వరకు అదే గ్లామర్ మెయిన్ టెన్ చేస్తూ వచ్చింది.
ప్రముఖ బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లు ను 2020 అక్టోబర్ 30న పెళ్లి చేసుకుని మ్యారీడ్ లైఫ్ ను కూడా ఆస్వాదిస్తోంది.ఇక పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు ఒప్పుకుంటూ స్పీడ్ పెంచింది.
అయితే ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసిన తర్వాత మరేమీ సినిమాలు ఒప్పుకోవడం లేదు.ఈ సినిమాలో చేసిన ఈమె రోల్ ను తీసేసారు.కాజల్ తల్లి కాబోతున్న నేపథ్యంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
ఇటీవలే కాజల్ అగర్వాల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
ప్రెసెంట్ ఈమె మాతృత్వం లోని మాధుర్యన్ని ఆస్వాదిస్తోంది.తల్లిగా మారిన తర్వాత ఇంట్లోనే ఈమె లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.
అయితే ఇక ఈమె మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది.అయితే ఇప్పుడు మాత్రం కాజల్ రెమ్యునరేషన్ చూడకుండా ఈమె డిఫెరెంట్ గా ఉండే పాత్రలను చేయాలని అనుకుంటుందట.

ప్రెసెంట్ ఈమెకు వరుస ఆఫర్స్ కూడా వస్తున్నట్టు తెలుస్తుంది.ఓటిటి ప్లాట్ ఫామ్ లో కాజల్ అగర్వాల్ కు వెబ్ సిరీస్ లలో నటించే అవకాశాలు వస్తున్నట్టు టాక్.ఇంతకు ముందే ఈమె వెబ్ సిరీస్ లో నటించినా అది దారుణంగా విఫలం అయ్యింది.అయినా కూడా హాట్ స్టార్ నుండి మరొక వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చిందట.
అది కూడా దాదాపు 3 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది.ఈ వెబ్ సిరీస్ కు కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.