ఆ టైమ్ లో రామ్ కి ఎవరు సపోర్ట్ గా ఉండలేదా..!

కనిపించడానికి స్టార్ ఇమేజ్ బాగానే ఉంటుంది.కానీ దాన్ని మెయింటైన్ చేయడానికే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది.

 Nobody Support Ram On His Career Bad Days , Krithi Shetty,lingusami,ram, Ram Mo-TeluguStop.com

స్టార్ గా అభిమానులు కేరింతల్లో హీరో ఇమేజ్ హైలెట్ అవుతున్నా అతను కెరియర్ ఫాం లో లేనప్పుడు అదే ఫ్యాన్స్ విమర్శలు చేస్తారు.అంతేకాదు ఇండస్ట్రీ నుంచి కూడా అనుకున్నంత సపోర్ట్ దొరకదు.

ఇదే విషయాన్ని ఎనర్జిటిక్ స్టార్ రామ్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు.రామ్ హీరోగా లింగుసామి డైరక్షన్ లో వస్తున్న సినిమా ది వారియర్.

ఈ సినిమా ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో తన కెరియర్ లో పడిన ఇబ్బందుల గురించి చెప్పాడు రామ్.

నిర్మాత స్రవంతి రవి కిశోర్ ఇంటి నుంచి హీరోగా పరిచయమైన రామ్ యూత్ లో తనకంటూ ఒక సెపరేట్ ఫాలోయింగ్ వచ్చేలా చేసుకున్నాడు.దేవదాస్ నుంచి రాబోతున్న ది వారియర్ వరకు తనని నమ్మి టికెట్ కొని చూసే ఆడియెన్స్ కోసమే తన సినిమాలంటూ చెప్పుకొచ్చారు రామ్.

ఇక తను ఫ్లాపుల్లో ఉన్న టైం లో కూడా ఎవరో వచ్చి తనకి సపోర్ట్ ఇస్తారని ఆశించలేదని.తనని తానే మళ్లీ అంతా సెట్ రైట్ చేసుకునేలా మార్చుకున్నానని అన్నారు రామ్.

Telugu Krithi Shetty, Lingusami, Ram, Ram Pothineni, Warrior, Tollywood, Ustad R

అయితే ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నప్పుడు ఒకరికోసం ఇంకొకరు ఎప్పుడూ టైం ని స్పెండ్ చేయరని.అలా చేయాలని కూడా తాను ఆశించనని అన్నారు రామ్.కెరియర్ లో ప్రతి ఒక్కరికి ఒక దశలో ఓ క్లారిటీ వచ్చేస్తుందని.దాన్ని బట్టి కెరియర్ సెట్ రైట్ చేసుకోవాలని అన్నారు రామ్.ది వారియర్ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్న రామ్ ఈ సినిమాతో తమిళంలో కూడా తన ఖాతా తెరవాలని అనుకుంటున్నారు.రామ్, కృతి శెట్టి జోడీ కూడా వారియర్ సినిమాకు ప్లస్ అవుతుందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube