ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి.సైబర్ క్రిమినల్స్ కొత్త కొత్త పద్దతులతో దోచుకుంటున్నారు.
తాజాగా మరో మాల్ వేర్ సాయంతో సైబర్ దాడులకు పాల్పడటం మొదలు పెట్టేశారు.అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్ సెక్యూరిటీ సంస్థ జింపేరియం ఓ షాకింగ్ విషయం తెలిపింది.
ప్రపంచంలోని 70 దేశాల్లో 10 మిలియన్లకు పైగా ఆండ్రాయిడ్ యూజర్లు డేంజర్ లో ఉన్నట్లు తెలిపింది.‘గ్రిఫ్ట్ హార్స్’ అనే మాల్‌వేర్ సాయంతో సైబర్ నేరాలు జరిగే అవకాశం ఉందని ఆ సంస్థ నివేదిక తెలియజేస్తోంది.70 దేశాలకు చెందిన ఆండ్రాయిడ్ యూజర్ల అకౌంట్ల నుంచి డబ్బు దోచుకునేందుకు సైబర్ క్రిమినల్స్ గ్రూప్ రెడీ అయ్యింది పేర్కొంది.ఈ గ్రూపు నవంబర్ 2020 నుంచి క్యాంపెయిన్ చేస్తోందని జింపేరియం హెచ్చరికలు జారీ చేసింది.
సైబర్ నేరగాళ్లు పక్కా ప్లాన్‌తో గూగుల్ ప్లే స్టోర్, థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా లింక్స్ పంపి యూజర్ల ఈ-మెయిల్, బ్యాంక్ ఖాతాల వివరాలను తెలుసుకుని డబ్బులను దోచుకుంటున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.
సైబర్ నేరగాళ్లు చాలా సులభంగా డబ్బులను దోచుకుంటున్నారు.
ముందుగా లోకల్ లాంగ్వేజ్ లో యూజర్లను అట్రాక్ట్ చేసేలా యాడ్స్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లకు పంపి ఆ యాడ్స్ ద్వారా ఉండే లింక్ క్లిక్ చేయమని చెబుతారు.అలా క్లిక్ చేస్తే కళ్లు చెదిరే గిఫ్టులు పొందుతారని నమ్మబలుకుతారు.
ఆ ఆఫర్లకు ఆకర్షితమైన యూజర్లు పొరపాటున ఆ లింక్ క్లిక్ చేస్తే వారి ఖాతా ఖాళీ అయిపోయినట్లే.వాళ్లు సెలక్ట్ చేసుకున్న గిఫ్ట్ కావాలనుకుంటే ఫోన్ నెంబర్‌తో పాటు మెయిల్ ఐడీ, వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయాలి.
ఆ సమయంలో ఐపీ అడ్రస్ తో వాటిని దొంగిలించి డైరెక్ట్‌గా యూజర్ ఖాతాలో ఉండేటటువంటి డబ్బుని దోచుకుంటారు.ఈ విధంగా 70 దేశాల్లో ఒక్కో ఖాతాదారుడి నుంచి రూ.3,100 వసూలు చేస్తారని ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ జెడ్‌ల్యాబ్స్ పేర్కొంది.2021లో ఇదే అత్యంత భయంకరమైన సైబర్ దాడి అని ఆ సంస్థ పేర్కొంది.

గ్రిఫ్ట్ హార్స్ మాల్ వేర్ తో ఇన్ ఫెక్ట్ అయిన పాపులర్ యాప్స్ ఇవే:Handy Translator ProHeart Rate and Pulse TrackerGeospot: GPS Location TrackeriCare-Find LocationMy Chat Translator.