రా రైస్ మిల్లర్లతో సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

నిర్దేశించిన లక్ష్యం మేరకు సీఎంఆర్ ఇవ్వాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్( Additional Collector Khimya Naik ) ఆదేశించారు.2023-24 ఖరీఫ్ సీఎంఆర్ ఎఫ్సీఐ కి ఇవ్వడంపై జిల్లాలోని 68 రా రైస్ మిల్లుల యజమానులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.జిల్లాలోని రా రైస్ మిల్లులకు ఇచ్చిన ధాన్యం వివరాలు తెలియజేస్తూ ఇప్పటిదాకా ఎంత సీఎంఆర్ ఇచ్చారో అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మాట్లాడారు.2023-24 ఖరీఫ్ సీజన్లో( Kharif Season ) ఆయా రా రైస్ మిల్లులకు కలిపి మొత్తం 1,44,571 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇచ్చామని, 96,690 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉందని వెల్లడించారు.ఎఫ్సీఐ నిబంధనల మేరకు నాణ్యతా ప్రమాణాలతో సీఎంఆర్( CMR ) ఇవ్వాలని స్పష్టం చేశారు.

 Additional Collector Khimya Naik In A Meeting With Raw Rice Millers,additional C-TeluguStop.com

ఇప్పటిదాకా సీఎంఆర్ ఇవ్వని రైస్ మిల్లుల జాబితా( Rice Mills List ) తయారు చేయాలని సూచించారు.వారం తరువాత కూడా సీఎంఆర్ ఇవ్వకపోతే వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.

అయినా మార్పు రాకపోతే ఆయా మిల్లుల బ్లాక్ లిస్ట్ లో పెట్టి సీజ్ చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పేర్కొన్నారు.అనంతరం రైస్ మిల్లర్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ జితేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube