ఓటు హక్కు( Right to Vote )ను ప్రతీ ఓటరు తప్పనిసరిగా వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని డీఆర్డీఓ శేషాద్రి పిలుపునిచ్చారు.జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు ఓటు హక్కు వినియోగంపై సోమవారం స్వీప్ ( Systematic Voters Education And Electoral Participation ) ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని సమాఖ్య భవనంలో, రుద్రవరం గ్రామంలోని వీఓ భవనంలో అవగాహన సదస్సులు నిర్వహించారు.‘ఐ ఓటు ఫర్ ష్యూర్'( I Vote For Sure ) ఓటు హక్కు నా బాధ్యత’ పై మండల సమాఖ్య బాధ్యులు, వీఓ ప్రెసిడెంట్లు, వీఓఏలకు అవగాహన కల్పించారు.ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తమ ఓటును వేయాలని ఓటరు ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి, అడిషనల్ డీఆర్డీఓ గొట్టే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.