నెల్లూరు జిల్లా కావలిలో బస్సు డ్రైవర్ పై దాడికి పాల్పడిన ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.
ప్రధాన నిందితుడు ఇంకా దొరకలేదని పోలీసులు చెప్పిన సంగతి తెలిసిందే.ప్రజలను బెదిరించడంతో పాటు మోసాలకు పాల్పడటం ఈ ముఠాకు అలవాటని పోలీసులు తెలిపారను.
ఈ క్రమంలోనే నిందితులపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.నిందితుడు దేవరకొండ సుధీర్ బాబుపై కావాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో సుమారు 14 కేసులు నమోదు కాగా ఇతర పోలీస్ స్టేషన్లలో 7 కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది.
గుర్రంకొండ కిషోర్ పై 10 కేసులు, అరుణ్ కుమార్ పై 2 కేసులు, కర్రెద్దుల విజయ్ కుమార్ పై 9తో పాటు పుట్టా శివకుమార్ పై మొత్తం 8 కేసులు నమోదయ్యాయని సమాచారం.అయితే బైకు రోడ్డుకు అడ్డంగా ఉన్న నేపథ్యంలో బస్సు డ్రైవర్ హారన్ మోగించగా .వాహనదారుడు గొడవకు దిగాడు.అనంతరం కొంతమంది వ్యక్తులతో కలిసి కారులో వచ్చి ఆర్టీసీ బస్సును వెంబడించిన నిందితులు డ్రైవర్ పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
అంతేకాకుండా చంపేసి పాతిపెడతామంటూ బెదిరించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం 10 మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
మరోవైపు ఆర్టీసీ డ్రైవర్ పై దాడి ఘటనను భారతీయ యువమోర్చా ఖండించింది.దాడిని నిరసిస్తూ కావలి పట్టణశాఖకు చెందిన యువమోర్చా నాయకులు ర్యాలీ నిర్వహించారు.