హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు( HMDA Former Director Shiva Balakrishna )లో ఏసీబీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా శివబాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
భరత్, భరణి, సత్యనారాయణతో పాటు శ్రీకర్ లకు అధికారులు నోటీసులు అందజేశారు.ఈ క్రమంలో వారిని ఏసీబీ కార్యాలయంలో అధికారులు విచారించనున్నారు.
భరణిని హెచ్ఎండీఏలో కంప్యూటర్ ఆపరేటర్ గా శివబాలకృష్ణ పెట్టించారని తెలుస్తోంది.
అలాగే శివబాలకృష్ణకు పీఏగా భరణి( PA Bharani ) ఉన్నారు.అటు భరత్ ఎన్విస్ డిజైన్ పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.మరో బినామీ ప్రమోద్ కుమార్ కు మీనాక్షి కన్స్ట్రక్షన్( Meenakshi Constructions ) లో ఉద్యోగం ఇప్పించిన శివబాలకృష్ణ బంధువులను బినామీలుగా వాడుకుని కోట్లలో సంపాదించారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే భరత్, భరణితో పాటు అతడి స్నేహితుడు సత్యనారాయణను ఏసీబీ అధికారులు( ACB Officials ) విచారించనున్నారు.