సూర్యాపేట జిల్లా: మునగాల మండల కేంద్రంలో 65వ,జాతీయ రహదారిపై గత కాలంగా స్ట్రీట్ లైట్స్ వెలుగులు లేకపోవడంతో వాహనదారులు, గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు.జిఎంఆర్ అధికారుల నిర్లక్ష్యంతోనే లైట్లు వెలగడం లేదని, దీనితో రాత్రివేళల్లో రహదారిపై చీకటి రాజ్యమేలుతుందని ఆరోపిస్తున్నారు.
నిత్యం రద్దీగా ఉండే మండల కేంద్రంలో స్ట్రీట్ లైట్స్ వెలగక చీకటి పడితే రోడ్డు దాటాలంటే వాహనాలు కనబడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాపోతున్నారు.
జిఎంఆర్ అధికారులకు పలుమార్లు చెప్పినా మరమ్మతులు చేస్తున్నామని చెబుతున్నారని, మరమ్మతులు చేస్తే ఎందుకు వెలగడం లేదని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి హైవే స్ట్రీట్ లైట్స్ వెలిగేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.