అమీర్ ఖాన్ అలా పిలిచి మా అగ్రిమెంట్ బ్రేక్ చేశాడు...రాజమౌళి షాకింగ్ కామెంట్స్!

రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమా మార్చి 25 వ తేదీ విడుదలయి ప్రపంచవ్యాప్తంగా అధిక కలెక్షన్లను రాబట్టి సరికొత్త రికార్డును సృష్టించింది.

 Aamir Khan Called Like That And Broke Our Agreement Rajamouli Shocking Comments-TeluguStop.com

ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలయి ఎంతో మంచి విజయాన్ని అందుకోవడంతో ముంబైలో ఈ సినిమా సక్సెస్ పార్టీ అరేంజ్ చేసారు.ఈ వేడుక కోసం బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్,కరణ్ జోహార్ వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ చిత్ర బృందం పై ప్రశంసలు కురిపించారు.ఈ సినిమా విడుదలకు ముందు రాజమౌళి గారు.అలాగే చిత్రబృందం ఎలాంటి ఒత్తిడికి గురైందో నాకు తెలుసు.ఇప్పుడు ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకోవడంతో ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఎప్పుడు ఇలాంటి విజయాలను అందుకొని సంతోషంగా ఉండాలని అమీర్ ఖాన్ ఆకాంక్షించారు.

Telugu Aamir Khan, Bollywood, Rajamouli, Tollywood-Movie

ఇక ఇదే వేదికపై రాజమౌళి మాట్లాడుతూ అమీర్ ఖాన్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ నటుడు అమీర్ ఖాన్, నాకు మధ్య ఒక ఒప్పందం ఉంది.మేమిద్దరం ఎప్పుడూ కూడా సర్, గారు అనే పదాలు ఉపయోగించుకోకూడదనే అగ్రిమెంట్ మా మధ్యన ఉంది.

కానీ అమీర్ ఖాన్ నన్ను రాజాజీ అని పిలిచి మా ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ బ్రేక్ చేశాడని రాజమౌళి ఈ సందర్భంగా అమీర్ ఖాన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube