దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా నటించిన తాజా చిత్రం కేజిఎఫ్ 2.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న ఒక అప్డేట్ వచ్చినా కూడా అది ప్రేక్షకులలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఇకపోతే ఈ కేజిఎఫ్ 2 సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ రికార్డులను సృష్టిస్తోంది.
విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
ఈ ప్రమోషన్స్ లో భాగంగా హీరో యష్ పాల్గొని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా యష్ మాట్లాడుతూ.తాను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు చాలా అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపాడు.స్కూల్లో తోటి స్నేహితులు అందరూ పెద్దయ్యాక ఏమవుతావు అని అడగగా వారందరూ డాక్టర్,ఇంజనీర్,లాయర్ అని చెప్పగా నేను మాత్రం సినిమా యాక్టర్ అవుతాను అని చెప్పడంతో వారు అందరు నన్ను చూసి ఒక్కసారిగా నవ్వేవారు అని చెప్పుకొచ్చాడు యష్.

అంతేకాకుండా అందరూ యష్ ని అవమానించే విధంగా మాట్లాడేవారు అని తెలిపాడు యష్.కానీ ఆ సమయంలో ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా, నాకున్న పట్టుదలతో నటుల్ని కావాలి అనుకున్నాను.ఇప్పుడు ఇలా మీ ముందు నటుడిగా నిలుచున్నాను అని చెప్పుకొచ్చాడు యష్.యష్ నటించిన ఈ కేజిఎఫ్ 2 సినిమా కోసం యావత్ సినీ ప్రేక్షకులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.అయితే ఇప్పటికే విడుదల అయిన కేజిఎఫ్ 1 సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే.దీనితో కే జి ఎఫ్ 2 ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
మరి ప్రేక్షకుల అంచనాల మేరకు ఈ సినిమా ఈ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.







