న్యూయార్క్ నగరంలో ఒక్క సారిగా అందరూ ఉలిక్కిపడ్డారు.ఒక సూట్కేసు రేపిన కలకలం తో తీవ్ర ఆందోళన నెలకొంది తీరా పోలీసులు ఆ సూట్కేసులో బాంబు ఉందేమో అనే అనుమానంతో జాగ్రత్తగా తెరిచి చూడగా అందులో ఓ యువతి శవం ఉండటం చూసి అందరూ షాక్ అయ్యారు.
ఓ 24 ఏళ్ల వయసు ఉన్న యువతి శవం ఉండటం చూసిన పోలీసులు దర్యాప్తు చేశారు.
ఆమె పేరు.వెలరీ రియస్…ఆమెకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఈ మధ్య కాలంలో వారి ఇద్దరికీ తగువులు వస్తున్నాయని ఈ గొడవలు కారణంగా విసిగిపోయిన ఆమె అతడిని వదిలించుకోవాలని అనుకుంది దాంతో ఈ విషయం అతడితో చెప్పేసింది.దాంతో కోపంతో ఊగిపోయిన అతడు, ఆమెని చంపి ఉంటాడని పోలీసులు దాదాపు నిర్దారణకి వచ్చారు.
ఎక్కడ ఆమె తనని విడిచి వెళ్ళిపోతుందో అనే భయంతో అతడు ఆమెని చంపి ఉంటాడని భావిస్తున్నారు పోలీసులు.అయితే ఆమె బాయ్ ఫ్రెండ్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు.నిన్నటి రోజున ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంభ సభ్యులు.
తాజా వార్తలు