యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వేల్స్‌లో( Wales, United Kingdom ) ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనలో ఒక నర్సుతో శృంగారం చేస్తున్న సమయంలో ఒక రోగి దురదృష్టం కొద్దీ చనిపోయాడు.
హాస్పిటల్‌కి వచ్చిన పేషెంట్‌తో శృంగార సంబంధం పెట్టుకుని, అతడి చావుకు కారణమైనందున ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు.
పెనెలోప్ విలియమ్స్( Penelope Williams ) (42) పేరు గల ఈ నర్సు ఆ రోగితో ఏడాది పాటు రిలేషన్ కలిగి ఉన్నట్లు అంగీకరించింది.అతను ఒక డయాలసిస్ రోగి అని, తరచుగా ఆసుపత్రికి వస్తాడని, అలా తమ మధ్య పరిచయం ఏర్పడిందని తెలిపింది.ఒక రోజు నైట్ ఆసుపత్రి పార్కింగ్ స్థలంలో కారు నిలిపి అందులో శృంగారం చేసినట్లు పేర్కొంది.
అలా వారిద్దరూ రాసలీలలు చేస్తున్న సమయంలోనే అతను మరణించాడు.రోగి కుప్పకూలినప్పుడు, అంబులెన్స్‌కు కాల్ చేయడానికి బదులుగా, నర్సు సహోద్యోగిని పిలిచింది.
సహాయం కోసం కాల్ చేయమని ఆమె సహచరులు ఆమెను కోరినప్పటికీ, ఆమె వారి సలహాను పట్టించుకోలేదు.
విచారణలో, నర్సు( nurse ) మొదట పోలీసులకు అబద్ధం చెప్పింది, అతను తన ఆరోగ్యం గురించి ఫేస్‌బుక్‌లో మెసేజ్ పంపిన తర్వాత ఆమె రోగిని కలవడానికి వెళ్లినట్లు చెప్పింది.ఆ తర్వాత అతనితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు అంగీకరించింది.అయితే రోగి హార్ట్ ఫెయిల్యూర్, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి వల్ల చనిపోయాడని తేలింది.
విచారణ తర్వాత, ఆసుపత్రి అధికారులు నర్సును ఆమె ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయించారు.ఆమె చర్యలు నర్సు వృత్తికి తగినవి కాదని, ఆ వృత్తి ప్రతిష్టను ఆమె దెబ్బతీస్తుందని వారు నమ్మారు.
కాగా ఈ బ్రిటిష్ నర్సు గురించి తక్కువ సమయంలోనే యూకే అంతటా తెలిసింది.శృంగారం చేస్తూ ఒకరి చావుకు కారణమైందనే నింద వల్ల సదరు నర్సు క్రుంగిపోతోంది.
మరోవైపు జాబ్ పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.