సోషల్ మీడియాలో రోజూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అయితే అందులో కొన్ని మాత్రమే నీటిజన్ల మనసులను తాకుతాయి.
అయితే ఇక్కడ ఎక్కువగా జంతువులకు సంబందించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి.మరీ ముఖ్యంగా రెండు విజాతి జంతువుల మధ్య గొడవలకు సంబందించిన వీడియోలను నెటిజనం ఎక్కువగా చూస్తూ వుంటారు.
దాంతో అవి కాస్త వైరల్ అవుతూ ఉంటాయి.కొన్నిసార్లు జంగిల్ సఫారీ( Jungle Safari ) సమయంలో పర్యాటకులు అలాంటి దృశ్యాలను చూసి తమ కెమెరాలలో బందిస్తూ వుంటారు.

కొన్నిసార్లు సింహాలు లేదా పులులు తమ ఆహారం కొరకు ఇతర అడవి జంతువులను వేటాడి తింటాయి.ఈ క్రమంలోనే పాము – ముంగిస( Snake – Mongoose ) ఒకదానితో ఒకటి పోరాడుతూ మనకి కనిపిస్తాయి.తాజాగా వాటి పోరుకు సంబందించిన వీడియో ఒకటి వైరల్ కావడం మనం గమనించవచ్చు.వాటి మధ్య శత్రుత్వం గురించి అందరికీ తెలిసిందే.ఇక్కడ వీడియోని గమనిస్తే పాము- ముంగిస ఒకదానితో ఒకటి ప్రమాదకరమైన రీతిలో పోట్లాడుకోవడం మనం చూడవచ్చు.పాము ముంగిసపై ఎలా దాడి చేస్తుందో.
ముంగీస తన ప్రతి దాడి నుండి ఎలా తప్పించుకుంటో ఇక్కడ చూడవచ్చు.ముంగిస కూడా పాముపై దాడి చేసేందుకు దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ, పాము దానిని కనీసం దగ్గరికి రానివ్వడంలేదు.

అదే సమయంలో ఉడతలు( Squirrels ) కూడా పాముపై దాడి చేయడానికి యత్నిస్తున్నాయి.అయితే పాము ధైర్యంతో అన్నిటిని ఎదుర్కోవడం ఇక్కడ వీడియోలో మీరు చూడవచ్చు.ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైల్డ్‌లైఫ్011 అనే ఐడితో షేర్ చేయబడగా చాలామంది దీనిని వీక్షించడం చూడవచ్చు.ఇప్పటివరకు 57 వేల కంటే ఎక్కువ సార్లు దీనిని చూడడం జరిగింది.
అంతే కాకుండా వందలాది మంది వీడియోను లైక్ చేయడం కూడా గమనించవచ్చు.ఇక కామెంట్లకైతే లెక్కేలేదు.
ఒకసారి మీరు కూడా ఈ వీడియోని తిలకించి జరా కామెంట్ చేయండి మరి!’
.






