నల్లగొండ జిల్లా: కొండమల్లేపల్లి పట్టణంలో ఆదివారం కురిసిన తేలికపాటి వర్షానికి కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై సాగర్ రోడ్ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.తేలికపాటి వర్షానికే రోడ్డు మొత్తం చెరువులా మారడంపై ప్రయాణికులు,వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు.
అసలే జాతీయ రహాదారి కావడంతో వాహనాల రద్దీ కూడా ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని ప్రయాణిస్తున్నారు.కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలతో జాతీయ రహదారి నిర్మించకపోవడం,
స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు కాసులకు కక్కుర్తిపడి పట్టించుకోక పోవడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు.
జాతీయ రహదారి వేసిన రెండు మూడు సంవత్సరాలకే ఇలా జరగడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని అంటున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు,రోడ్డు రవాణా శాఖ అధికారులు స్పందించి సమాంతరంగా రోడ్డు నిర్మించే విధంగా తగు చర్యలు చేపట్టి,ఈ రోడ్డు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.