రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ ప్రభుత్వమే తల్లి,తండ్రి అని వారినీ కాపాడ వలసిన బాధ్యత ప్రభుత్వానిదే అని బి ర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మాజీ మంత్రి సిరిసిల్ల ఏం ఎల్ ఏ కేటీఆర్( KTR ) పేర్కొన్నారు.జగిత్యాల జిల్లా మేట్ పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకులంలో చదువుకుంటూ తీవ్ర అస్వస్థతతో మృతి చెందిన విద్యార్థి అనిరుధ్ కుటుంబాన్ని ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బోప్పాపూర్ గ్రామంలో పరామర్శించారు.
కేటీఆర్ ఎదుట అనిరుధ్ తల్లి ప్రియాంక తీవ్రంగా రోదిస్తూ తన కుమారుడి లాగా భవిష్యత్తులో ఏ విద్యార్థి మరణించకుండా చూడాలని కేటీఆర్ కాళ్ళ పై బడి వేడుకుంది.ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని హాస్టళ్లలో.
చదువుతున్న విద్యార్థుల బాగోగులపై ,హాస్టళ్లలో సౌకర్యాలపై, వారికి పెట్టేభోజనము పై శ్రద్ధ వహించాలని కోరారు.విద్యార్థులకు వారి తల్లి దండ్రులకు ప్రభుత్వం భరోసాగా వుండాలని సూచించారు.
పెద్దా పూర్ సంఘటనపై మాజీ గురుకులాల కార్యదర్శిఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో అధ్యయన కమిటీని నియమించి రాష్ట్రంలోని హాస్టళ్లు,పాఠశాలలపై నివేదికలు తీసుకొని ప్రభుత్వానికి అందిస్తామని అన్నారు.వర్షాకాలము కావడం వలన హాస్టళ్లు,పరిసరాలలోని పిల్లలు ఆడుకుంటు వుంటారని ,వారువిష కీటకాల బారిన పడకుండా వుండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు.
పాఠశాలల పరిసరాలలోని ప్రాంతాలను శుభ్రం చేయించాలని కోరారు.తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని గురుకులాల్లో చేర్పిస్తే విద్యార్దులు సౌకర్యాలతో, ఫుడ్ పాయిజన్ తో, పాములు,విష కీటకాల తో మరణించడం తో వారి తల్లి దండ్రులకు తీరని శోకాన్ని కలిగించడం బాధాకరమని అన్నారు.
ఇప్పటి వరకు గురుకులాల్లో చదువుకుంటున్న 36 మంది విద్యార్థులు వివిధ కారణాలతో మరణించారని వారందరి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.ప్రభుత్వం గురుకులాల్లో, హాస్టళ్లలో చదివే విద్యార్థుల బాగోగులు ఎప్పటి కప్పుడు పరిశిలించుటకు అధికారులను వారం వారం ఆకస్మిక తనిఖీలు చేయించాలని అప్పుడే గురుకులాల్లో ,హాస్టళ్లలోనీ ఉద్యోగులు,సిబ్బంది అప్రమత్తంగా వుంటారని,తమ ప్రభుత్వ హయంలో గురుకులాల, హాస్టళ్ల లో చదివే విద్యార్థుల సౌకర్యాలపై అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు.
గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్( RS Praveen Kumar ) ను జిల్లాలోని అన్నిగురుకులల,హాస్టళ్ల విద్యార్థులు ఇప్పటికీ గుర్తు చేసుకోవడం ఆయన పనితీరుకు నిదర్శనమని ఆయన నేతృత్వంలో అధ్యయన కమిటీ వేసి నివేదికలు ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు కేటీఆర్ తెలిపారు.ఆయన వెంట బిఆర్ ఎస్ జిల్లా,మండల, నాయకులు,వివిధ గ్రామాల మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.