ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ది రాజాసాబ్( Raja Saab ) సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ రిలీజ్ కాగా ఈ గ్లింప్స్ కు ఏకంగా 20 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.ది రాజాసాబ్ గ్లింప్స్ ప్రభాస్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
ది రాజాసాబ్ ప్రభాస్ కెరీర్ లో మెమరబుల్ సినిమాగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ సినిమా ప్రభాస్ పాత్ర కు నత్తి ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

జై లవకుశ సినిమా( Jai Lava Kusa )లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నత్తి పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడం జరిగింది.ది రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ నత్తి పాత్రతో డైలాగ్స్ చెబితే ఎలా ఉండబోతుందనే చర్చ ప్రేక్షకుల మధ్య జరుగుతుండటం గమనార్హం.ది రాజాసాబ్ సినిమాతో స్టార్ హీరో ప్రభాస్ రిస్క్ చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ది రాజాసాబ్ సినిమాతో ప్రభాస్ ఖాతాలో మరో 1000 కోట్ల రూపాయల మూవీ చేరడం పక్కా అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ది రాజాసాబ్ సినిమాలో నిధి అగర్వాల్( Nidhhi Agerwal ), రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం అందుతోంది.ది రాజాసాబ్ మూవీ సక్సెస్ సాధిస్తే ఈ ముగ్గురు హీరోయిన్ల దశ మారినట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.ది రాజాసాబ్ సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉండనున్నాయని తెలుస్తోంది.2025 సంవత్సరం ఏప్రిల్ నెల 10వ తేదీన ది రాజాసాబ్ మూవీ విడుదల కానుంది.అదే రోజు విడుదల కావాల్సిన టాక్సిక్ మూవీ వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడింది.ది రాజాసాబ్ మూవీకి సోలోగా రిలీజ్ డేట్ దక్కితే ఈ సినిమాకు ఎంతో ప్లస్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ది రాజాసాబ్ మూవీ ప్రభాస్ కెరీర్ లో మరో స్పెషల్ మూవీ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.