రాజన్న సిరిసిల్ల జిల్లా: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఈఓ.ఎల్.రమాదేవి రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి కోడే మొక్కు చెల్లించుకున్నారు.ఆలయ అర్చకులు స్వామివారి కల్యాణ మండపంలో వేదోక్త ఆశీర్వచనము చేశారు.
ఆలయ ఏఈఓ బ్రహ్మన్న గారి శ్రీనివాస్ లడ్డు ప్రసాదం అందజేశారు.
రాజన్న ఆలయ ఈఓ రామకృష్ణ కు భద్రాచల శ్రీ రామచంద్ర స్వామి వారి ప్రసాదం అందజేసిన ఈఓ ఎల్ రమాదేవి.
వారి వెంట ప్రోటోకాల్ పరివేక్షకులు సిరిగిరి శ్రీరాములు, ఆలయ పరివేక్షకులు అలీ శంకర్ ,వరి నరసయ్య, ఆలయ ఇన్స్పెక్టర్ సంక పెళ్లి పవన్, సి సి ఎడ్ల శివసాయి ఉన్నారు.