కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్( Union Minister Rajnath Singh ) కీలక వ్యాఖ్యలు చేశారు.కుల రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించిందని ఆరోపించారు.
ముస్లింలకు బీజేపీ( BJP ) వ్యతిరేకమని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు.విశాఖలో( Visakhapatnam ) భూ కబ్జాలు పెరిగిపోయాయన్నారు.లాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, మిల్లర్ మాఫియా రాజ్యమేలుతున్నాయని పేర్కొన్నారు.ఏపీ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్న రాజ్నాథ్ సింగ్ ఏపీలో అవినీతి లేని ప్రభుత్వం కూటమితోనే సాధ్యమని చెప్పారు.
అదేవిధంగా రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.కూటమి అధికారంలోకి వస్తేనే భూదందాలకు అడ్డుకట్ట పడుతుందని తెలిపారు.