సిద్దు జొన్నలగడ్డ, అనుపమ కలిసిన నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్.( Tillu Square ) తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గా స్పందన లభిస్తోంది.
డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ సినిమా నిన్న రిలీజయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ప్రస్తుతం హిట్ టాక్ తో దూసుకుపోతుంది.
డీజే టిల్లు( DJ Tillu ) ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్ అవ్వడంతో టిల్లు స్క్వేర్ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉండగా ఆ అంచనాలను అందుకుంది ఈ సినిమా.
ఇకపోతే ఈ సినిమాకు ముందు హీరోయిన్ అనుపమ( Anupama ) ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సిద్ధూ గురించి, సినిమా గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ.మొదటి రోజు సెట్ కి వచ్చినప్పుడు సిద్ధూ( Siddhu Jonnalagadda ) కనీసం హాయ్ కూడా చెప్పలేదు.తన పని తాను చూసుకుంటున్నాడు.సడెన్ గా నా దగ్గరికి వచ్చి నన్ను అలాగే కాసేపు చూసి నా కాటుక, ఐబ్రోస్ గురించి సరిగ్గా లేవు అని మాట్లాడాడు.
నేను షాక్ అయ్యాను.ఏంటి ఈ అబ్బాయి ఇలా ఉన్నాడు అనుకున్నాను.సిద్ధూని బాగా హేట్ చేశాను.తనతో కూడా నీతో వర్క్ చేయడం నాకు నచ్చట్లేదు అంటే సింపుల్ గా అది నీ ఇష్టం అని అన్నాడు.నేను షాక్ అయ్యాను, అతని బిహేవియర్ కూడా నచ్చలేదు.వెంటనే కారవాన్ కి వెళ్లి మేనేజర్ కి కాల్ చేసి ఈ సినిమా నేను చేయాలనుకోవట్లేదు, ఇక్కడ అంతా వెరైటీగా ఉన్నారు అని చెప్పాను.
కానీ తర్వాత అర్థమైంది సిద్ధూ ఈ సినిమాకి రైటర్ కూడా అని.
టిల్లు క్యారెక్టర్ లోనే బయట కూడా ఉంటున్నాడని, వర్క్ తో స్ట్రెస్ లో ఉన్నాడని అర్ధం చేసుకున్నాను అని తెలిపింది.దీంతో ఇంటర్వ్యూలో అనుపమ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇప్పుడు సినిమా చూసిన తర్వాత లిల్లీ పాత్రలో అనుపమ ఒదిగిపోయిందని, ఒక పక్క రొమాన్స్ తో,మరో పక్క నటనతో మెప్పించింది అని అంటున్నారు.
సినిమా చూసిన ప్రేక్షకులు అనుపమ ఈ పాత్రకి 100 శాతం న్యాయం చేసిందని అంటున్నారు.