బీజేపీ నేత బండి సంజయ్( Bandi Sanjay ) కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) విద్యార్థులను రోడ్డున పడేసిందని విమర్శించారు.మూడేళ్లుగా రూ.7,800 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలా అని ప్రశ్నించారు.
డిగ్రీ, పీజీ కాలేజీలకు రూ.750 కోట్లు చెల్లిస్తామని టోకెన్లు ఇచ్చినా డబ్బులు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు.రేపటితో టోకెన్ల గడువు ముగుస్తుందన్న బండి సంజయ్ ఆ కాలేజీల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )జోక్యం చేసుకోవాలని కోరారు.
రేపటిలోగా ఇచ్చిన టోకెన్లకు డబ్బులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.