స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య( Balakrishna ) రూటే సపరేట్ అనే సంగతి తెలిసిందే.బాలయ్య తనకు నచ్చిన విధంగా ఉండటానికి ఇష్టపడతారు.
తన బిహేవియర్ విషయంలో కొన్నిసార్లు నెగిటివ్ కామెంట్లు( Negative Comments ) వచ్చినా ఆయన పట్టించుకోరు.బాలయ్యను అభిమానులు భోళా మనిషి అని కామెంట్లు చేస్తారు.
అయితే కొన్నిసార్లు బాలయ్య చేసిన పనులు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) సభలో బాలయ్య కాలి మీద కాలు వేసుకోవడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.బ్లడ్, బ్రీడ్ వేరు అని చాలా సందర్భాల్లో చెప్పిన బాలయ్య మోదీ సభలో ఇలా చేయడంపై సోషల్ మీడియా వేదిక( Social media )గా నెటిజన్లు ఫైర్ అయ్యారు.
ప్రధాని హోదాకు, మోదీ వయస్సుకు అయినా బాలయ్య గౌరవం ఇవ్వాల్సి ఉందని కామెంట్లు చేస్తున్నారు.
మోదీ సభలో బాలయ్య కాలి మీద కాలు వేసుకోవడం( Crossed Legs ) ఇదే తొలిసారి కాదని గతంలో కూడా అయన చాలా సందర్భాల్లో ఇదే విధంగా చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.బాలయ్య ఈ కామెంట్ల విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.బాలయ్య ఫ్యాన్స్ మాత్రం బాలయ్య నచ్చినట్టుగా ఉంటారని నచ్చింది చేస్తారని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
బాలయ్య ప్రస్తుతం బాబీ సినిమా( Director Bobby )తో బిజీగా ఉండగా ఈ సినిమా షూటింగ్ కు కొన్ని నెలల గ్యాప్ ఇచ్చారు.ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మాత్రమే బాలయ్య మళ్లీ షూటింగ్ లతో బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.బాలయ్య తర్వాత మూవీ అఖండ2 టైటిల్( Akhanda 2 ) తో బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కనుందని తెలుస్తోంది.