తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) 2024 ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.మరోసారి వైసీపీ అధికారంలోకి రాకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎప్పుడు చేయని హోంవర్క్.స్టడీ చేసి అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించడం జరిగింది.
ఇప్పటికే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి రెండు జాబితాలను ప్రకటించారు.ఇక త్వరలో మిగతా అభ్యర్థులను కూడా ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు.
ఇదే సమయంలో ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్తపడి జనసేన, బీజేపీ పార్టీలను( Janasena BJP ) కలుపుకోవడం జరిగింది.
2014లో గెలిచినట్టు 2024 ఎన్నికలలో గెలవాలని చంద్రబాబు భావిస్తున్నారు.ఇదిలా ఉంటే సోమవారం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి, ముస్లిం సంఘాల నేతలు చంద్రబాబుని కలవడం జరిగింది.ఈ సందర్భంగా సీఎం జగన్ పై ( CM Jagan ) విమర్శలు చేశారు.
జగన్ ముఖంలో ఓటమి భయం కొట్టొచ్చినట్లు కనబడుతుందని అన్నారు.అన్ని అస్త్రాలు అయిపోయాయి.
ఇప్పుడు కులమత రాజకీయాలపై జగన్ పడ్డారని విమర్శించారు.జనసేనతో తెలుగుదేశం పొత్తు పెట్టుకున్న సమయంలో కుల రాజకీయాలు చేసి జగన్ బోల్తా పడ్డారు.
ఇప్పుడు బీజేపీతో పొత్తు అనంతరం మత రాజకీయానికి వైసీపీ తెరతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ముస్లింలకు( Muslims ) మేలు చేసేది తెలుగుదేశం పార్టీయే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.