ఏపీలో టీడీపీ, జనసేన మరియు బీజేపీ పొత్తు( TDP Janasena BJP Alliance )తో ఎన్నికలకు వెళ్లనున్న సంగతి తెలిసిందే.ఇవాళ అభ్యర్థుల రెండో జాబితాను టీడీపీ ప్రకటించగా…తిరుపతి సీటు( Tirupathi )పై కూటమిలో రచ్చ మొదలైంది.
తిరుపతి నియోజకవర్గంలో జనసేన తరపున ఎమ్మెల్యే ఆరణికి( MLA Arani ) టికెట్ ఖరారు అయిందని సమాచారం.అయితే ఆరణికి టికెట్ ఇవ్వడాన్ని తిరుపతి టీడీపీ, బీజేపీతో పాటు కొందరు జనసేన నేతలు సైతం వ్యతిరేకిస్తున్నారు.
ఆ నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ బరిలో దిగాలని, లేని పక్షంలో స్థానిక బలిజ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాలని కోరుతున్నారు.దీంతో జనసేన అధినాయకత్వం సందిగ్ధంలో పడింది.