ఈ మధ్య కాలంలో బాలయ్య( Balakrishna ) ఏ సినిమాలో నటించినా ఆ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది.బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తూ ఊహించని స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.
బాలయ్య ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా శివరాత్రి పండుగ కానుకగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదలైంది.ఈ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం.“సింహం నక్కల మీదికి వస్తే వార్ అవ్వదురా లఫూట్.ఇట్స్ కాల్డ్ హంటింగ్” అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.
ఈ సినిమాలో బాలయ్య లుక్ సైతం స్టైలిష్ గా ఉంది.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోందని ఈ సినిమా కథ బంధిపోట్లకు సంబంధించిన కథ అని తెలుస్తోంది.
ఫస్ట్ గ్లింప్స్( NBK 109 Movie First Glimpse ) లో టైటిల్ గురించి కానీ రిలీజ్ డేట్ గురించి కానీ మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు.అయితే బాలయ్య ఫ్యాన్స్ కు ఈ సినిమా వింధు భోజనంలా ఉంటుందని క్లారిటీ మాత్రం వచ్చేసింది.బాలయ్య మూవీ గ్లింప్స్ మామూలుగా లేదుగా అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.ఈ సినిమాతో బాలయ్య 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
బాలయ్య ఖాతాలో ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ చేరడం ఖాయమని గ్లింప్స్ తో అర్థమైందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
గ్లింప్స్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. సితార నిర్మాతలు భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను నిర్మించారని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.మాస్ సినిమాలకు బాలయ్య న్యాయం చేసిన స్థాయిలో చాలామంది హీరోలు న్యాయం చేయలేరని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
బాబీ ఈ సినిమాతో వాల్తేరు వీరయ్యను మించిన హిట్ అందుకుంటారేమో చూడాల్సి ఉంది.