ఛత్తీస్గఢ్( Chhattisgarh ) రాష్ట్రంలో జవాన్లు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.సుక్మా జిల్లా బుర్కలంక ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఒక మావోయిస్ట్ మృతిచెందాడు.
మావోయిస్ట్ మృతదేహాంతో పాటు పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని కూడా జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.అనంతరం బుర్కలంక అటవీ ప్రాంతంలో జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
బీజాపూర్, దంతెవాడతో పాటు సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఎరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.భద్రతా బలగాల కూంబింగ్ నేపథ్యంలో మావోయిస్టులు కూడా అటవీ ప్రాంతాల్లో ఐఈడీలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.