Regional Ring Road : త్రిబుల్ ఆర్ లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలి

జిల్లాలో త్రిబుల్ ఆర్ రోడ్డు( RRR Road ) విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు విస్తరణ( Road Expansion )లో భూములు కోల్పోతున్న రైతులకు భూమికి బదులుగా భూమే కేటాయించాలని డిమాండ్ చేశారు.

 Farmers Protest For Regional Ring Road Realignment-TeluguStop.com

భూములు కోల్పోతున్నానని మనోవేదనకు గురై గుండెపోటుతో మృతి చెందిన సింగరాయ చెరువు గ్రామ రైతు మామిడాల నరసింహారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరారు.రెండోసారి నిర్వహించిన సర్వే ప్రకారం భూ సేకరణ చేస్తే రైతులు( Farmers ) ఎక్కువ భూమి కోల్పోవడం జరుగుతుందని,మొదట నిర్వహించిన సర్వే ప్రకారం భూ సేకరణ చేయాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube