ప్రస్తుత చలికాలంలో పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది కామన్ గా ఎదుర్కొనే సమస్యల్లో పెదాల పగుళ్లు( Chapped Lips ) ఒకటి.పగుళ్ల కారణంగా పెదాలు ఎంతో అసహ్యంగా మారతాయి.
పైగా తీవ్రమైన నొప్పి, బాధకు గురి చేస్తాయి.ఈ క్రమంలోనే పేదల పగుళ్లను నివారించుకోవడం కోసం రకరకాల క్రీమ్స్ ను వాడుతుంటారు.
కానీ కొన్ని చిన్న చిన్న నియమాలు పాటిస్తే పెదాల పగుళ్లు సమస్యను సహజంగానే దూరం చేసుకోవచ్చు.ఈ చలికాలంలో చాలా మంది చేసే తప్పు ఏంటంటే వాటర్ ను తక్కువగా తీసుకోవడం.
చల్లగానే ఉంది అన్న కారణంతో వాటర్ తాగడం మానేస్తుంటారు.మీరు చేసే ఈ చిన్న తప్పు వల్లే చలికాలంలో పెదాలు పగులుతుంటాయి.
వాతావరణం లో వచ్చే మార్పులకు తోడు మీరు వాటర్ ను సరిగ్గా తాగకపోవడం వల్ల పెదాలు పొడిబారిపోయి పగుళ్లు ఏర్పడతాయి.
అందుకే చలికాలం( Winter )లో వాటర్ విషయంలో అస్సలు తగ్గకూడదు.రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీటిని తీసుకోవాలని నిపుణులు బలంగా చెబుతున్నారు.బాడీ హైడ్రేటెడ్( Body Hydrated ) గా ఉంటే పెదాలు కూడా హైడ్రేటెడ్ గా ఉంటాయి.
అలాగే కెమికల్స్ తో కూడిన క్రీములను వాడే కంటే సహజ పద్ధతుల్లో పెదాల పగుళ్లను నివారించుకోవచ్చు.అందుకు నెయ్యి అద్భుతంగా తోడ్పడుతుంది.పేరుకున్న నెయ్యి( Ghee ) తీసుకుని పెదాలకు అప్లై చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల చాలా గంటల పాటు పెదాలు తేమగా ఉంటాయి.
డ్రై అవ్వకుండా, పగుళ్లు ఏర్పడకుండా ఉంటాయి.ఒకవేళ పగుళ్లు ఉన్న కూడా చాలా వేగంగా తగ్గుముఖం పడతాయి.
కెమికల్స్ తో నిండిన క్రిములకు బదులు నెయ్యిని రోజుకు రెండు మూడు సార్లు వాడారంటే పేదల పగుళ్లు అన్న మాటే అనరు.
పెదాల పగుళ్లకు దూరంగా ఉండడానికి మరొక చక్కని ఇంటి చిట్కా కూడా ఉంది.దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకోవాలి.మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు పెదాలకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.15 నిమిషాల తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఈ విధంగా కనుక చేశారంటే పెదాల పగుళ్లు పరారవుతాయి.మీ లిప్స్ స్మూత్ గా మరియు బ్యూటిఫుల్ గా మెరుస్తాయి.