నల్లగొండ జిల్లా:నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ చైర్మన్,వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని సోమవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనకు తీర్మాన కాపీని అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019లోని సెక్షన్-37 ప్రకారం గత జనవరిలో కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నోటీసులు ఇచ్చినా,కోర్టు స్టే ఇవ్వడం వల్ల ఆగాల్సి వచ్చిందని అన్నారు.
ఇప్పుడు నందికొండ మున్సిపాలిటీ చైర్మన్,వైస్ చైర్మన్ తప్ప మిగతా 9 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కలెక్టర్ కి, అధికారులకు తీర్మానం ఇచ్చామన్నారు.కలెక్టర్ స్పందించి వెంటనే అవిశ్వాసం త్వరగా పెడతామని హామీ ఇచ్చారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నందికొండ కౌన్సిలర్లు తిరుమలకొండ మోహన్ రావు,ఈర్ల రామకృష్ణ,నిమ్మల ఇందిరా,జి.అన్నపూర్ణ, శిరీష,నందిని,మంగ్తా నాయక్,మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.