నల్లగొండ జిల్లా:జిల్లాలో ఒక యువ ప్రేమజంట చైన్ స్నాచింగ్( Chain Snatching )లకు పాల్పడుతున్నట్లు జిల్లా పోలీసులు గుర్తించారు.స్కూటీపై వచ్చిన ఈ జంట ఒంటరిగా వెళుతున్న మహిళల మెడల్లో నుంచి చైన్ ను లాగేసుకుటున్నారని,యవకుడు స్కూటీ( Scooty ) నడు పుతుండగా,యువతి మాత్రం మహిళ మెడల్లో నుంచి చైన్‌లను తెంపుకుని పారిపోతున్నారని,ఈ జంట కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
ఈ ఇద్దరు లవర్స్ గా పోలీసులు గుర్తించారు.ఇక విషయానికి వస్తే నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం యారగండ్లపల్లి గ్రామానికి చెందిన సాతూ సునీత మెడలో నాలుగు తులాల చైన్ లాక్కొని పారిపోయారు.
అయితే స్థానికులు వెంబడించినా హై స్పీడ్ తో పారి పోవడంతో సీసీ ఫుటేజ్( CCTV footage ) ద్వారా ఈ జంటను గుర్తించారు.దేవరకొండ డిఎస్పి మీడియాతో మాట్లాడుతూ ఈ యువ జంట కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.