శరీరానికి విటమిన్ డి( Vitamin D ) ఎంతో అవసరం.ఇది లోపిస్తే ప్రమాదమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఉదయం పూట తేలికపాటి సూర్యకాంతి శరీరానికి తగలడం వల్ల విటమిన్ డి అందుతుంది.రక్తంలో కాల్షియం( Calcium ) సమతుల్యతను కాపాడుకోవడానికి ఎముకలు నిర్మించేందుకు విటమిన్ డి కీలకపాత్ర పోషిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా సుమారు ఒక మిలియన్ మంది ప్రజలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని తాజా గుణాంకాలు చెబుతున్నారు.ఈ లోపం వల్ల నాడీ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ( Nervous system, immune system ), ఎముకలు,కీళ్ల రుగ్మతలు ఎదురవుతున్నాయి.
అంతేకాకుండా ఈ భయంకరమైన లక్షణాలు కనిపిస్తే మాత్రం విటమిన్ డీ లోపంతో బాధపడుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు.ఒత్తిడి, ఆహారం, జీవనశైలిలో మార్పులు వంటి అనేక ఇతర సమస్యల కారణంగా ఆందోళన, నిరాశ కలుగుతాయి.
విటమిన్ డి లోపం వల్ల కనిపించే ప్రధానమైన లక్షణాల్లో ఇది ఒకటి.

శరీరానికి సూర్య రష్మి తగిలినప్పుడు మెలటోనిన్ నుంచి సెరోటోనిన్ ఉత్పత్తి చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.ఈ సెరోటోనిన్ తగ్గినప్పుడు చిరాకు, నిరాశ, ఆందోళనగా అనిపిస్తుంది.ఇంకా చెప్పాలంటే విటమిన్ డి లోపం అంటే శరీరంలో కాల్షియం తగినంతగా శోషించలేదని అర్థం చేసుకోవచ్చు.
దీని వల్ల ఎముకలు బలహీనపడతాయి.ఫలితంగా దీర్ఘకాలిక కండరాలను నొప్పి, బోలు ఎముకల వ్యాధి ఏర్పడుతుంది.
జుట్టు రాలడం సాధారణ సమస్య అనుకుంటారు.కానీ విటమిన్ డి లోపం వల్ల కూడా జుట్టు రాలే ప్రమాదం ఉంది.
విటమిన్ డి తగ్గినప్పుడు జుట్టు, చర్మం, ప్రధాన నిర్మాణ భాగాలు బలహీనంగా మారి వాటి శక్తిని కోల్పోయినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని అధ్యయనాల ప్రకారం విటమిన్ డీ లోపం వల్ల స్త్రీలు, పురుషులలో వంధ్యత్వానికి దారితీస్తుంది.
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ తో బాధపడేవారు విటమిన్ డీ లోపంతో బాధపడే మహిళల్లో గర్భాశయ ఫైబ్రాయిడ్లు అండాశయాలు తగ్గడానికి కారణం అవుతాయి.పురుషులలో అయితే స్పెర్మ్ కౌంట్ తగ్గి పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుంది.