రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

రజనీకాంత్.ఇండియన్ సూపర్ స్టార్.

 Why Rajiniknath Stopped Acting In Tollywood, Rajinikanth, Tollywood, Mohan Babu,-TeluguStop.com

తన చక్కటి నటనతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపు ఊపుతున్న నటడు.దిగ్గజ దర్శకుడు బాలచందర్ తెరకెక్కించిన తమిళ సినిమా అపూర్వ రాగంగ‌ళ్ తో వెండితెరకు పరిచయం అయ్యాడు రజనీ.

ఆ తర్వాత అదే దర్శకుడు తీసిన అంతులేని క‌థ సినిమాతో తెలుగు జనాలకు పరిచయం అయ్యాడు.అప్పటి నుంచి తెలుగు, తమిళ సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

కానీ ఎందుకో తెలియదు కానీ మధ్యలో ఓ మూడు సంవత్సరాల పాటు ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు.అనంతరం ఇదే నా స‌వాల్, న్యాయం మీరే చెప్పాలి, జీవ‌న పోరాటం సినిమాలు చేశాడు.

అనంతరం తమిళ సినిమాల మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు.అయితే తన మిత్రుడు మోహన్ బాబు కోసం పెదరాయుడు సినిమాలో పాపారాయుడు అనే కీ రోల్ పోషించాడు రజనీ.

అయితే ఆయన తెలుగు సినిమాలు కావాలనే తగ్గించుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.పలు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు చేసిన ఆయన.కొంత కాలం పాటు ఎందుకు తెలుగు చిత్రాల్లో నటించలేదని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఆశ్చర్యకర సమాధానం చెప్పాడు.ఇక నుంచి తాను తెలుగు సినిమాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.

తాను తెలుగులో నటించిన సినిమాలను తమిళంలోకి డబ్ చేసి విడుదల చేస్తున్నారని.అలా చేయడం జనాలను మోసం చేయడం లాంటిదే అవుతుందని చెప్పాడు.

ఒక భాష నుంచి మరొక భాషలోకి డబ్బింగ్ చేసేటప్పుడు అది డబ్బింగ్ సినిమా అని జనాలకు చెప్పాలని రజనీ అభిప్రాయపడ్డాడు.ఇలా డబ్బింగ్ చేయడం మూలంగా సినిమాలో సోల్ మిస్ అవుతుందన్నాడు.

అందుకే తెలుగు సినిమాలు చేయాలి అనుకోవడం లేదని వెల్లడించాడు.

Telugu Mohan Babu, Pedarayudu, Rajinikanth, Tamil, Telugu, Tollywood-Telugu Stop

ఈ ఇంటర్వ్యూకు ముందు రెగ్యులర్ గా తెలుగు సినిమాలు చేసిన రజనీ.ఆ తర్వాత కొంతకాలం దూరంగా ఉన్నాడు.అనంతరం తన నిర్ణయాన్ని సడలించాడు.

కొన్ని తెలుగు సినిమాల్లో నటించాడు.అవి కూడా చక్కటి విజయాన్ని అందుకున్నాయి.

మొత్తంగా తన చక్కటి నటనతో ఇండియన్ సూపర్ స్టార్ గా ఎదిగాడు రజనీ కాంత్.a

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube