ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తమిళ దర్శకుడు లింగుసామి డైరక్షన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.స్రవంతి మూవీస్ బ్యానర్ లో స్రవంతి రవికిశోర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.
సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. రామ్ సరసన కృతి జోడీ సూపర్ అనేస్తున్నారు ఆడియెన్స్.
ఇక ఈ సినిమాలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు.లింగుసామి రామ్ కోసం ఓ పవర్ ఫుల్ పోలీస్ డ్రామాని రాసినట్టు తెలుస్తుంది.
అయితే ఇక్కడ విశేషం ఏంటంటే రామ్ తన కెరియర్ లో మొదటిసారి పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు.
ఇస్మార్ట్ శంకర్, రెడ్ వరుసగా రెండు సినిమాల హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న రాం లింగుసామి సినిమాతో హ్యాట్రిక్ మీద కన్నేశాడు.
ఈ సినిమాలో రాం పోలీస్ పాత్రలో అందరికి షాక్ ఇస్తాడని తెలుస్తుంది.పోలీస్ పాత్ర కోసం రామ్ తన లుక్ మీద దృష్టి పెట్టినట్టు టాక్.ఇప్పటికే దానికి కావాల్సిన దేహ దారుడ్యం కోసం ఎక్కువ టైం జిమ్ లోనే గడుపుతున్నాడని తెలుస్తుంది.లింగుసామి, రామ్ కాంబో ప్రేక్షకులను కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు.
మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరిస్తుందా లేదా అన్నది చూడాలి.