తెలుగు సినిమా పరిశ్రమలో మెగా హీరోలలో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మరియు ఆయనకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే పవన్ కళ్యాణ్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా ప్రజలకు సేవ చేయాలని మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం కూడా చేస్తున్నాడు.
కాగా పవన్ కళ్యాణ్ దాదాపుగా మూడు సంవత్సరాల తర్వాత ఇటీవలే “వకీల్ సాబ్” చిత్రంతో మళ్ళీ హీరోగా ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాడు.అయితే పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో తన స్నేహితులతో చాలా సన్నిహితంగా ఉంటాడు.
ఈ క్రమంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి, బండ్ల గణేష్ తదితరులతో బాగానే టచ్ లో ఉంటాడు.
అయితే తాజాగా ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అయితే ఇంతకీ ఆ ఫోటోని ఒకసరి పరిశీలించినట్లయితే గతంలో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతోషంగా నవ్వుతున్న సమయంలో తీసినట్లు తెలుస్తోంది.
అలాగే ఆనంద్ సాయి ఈ ఫోటోకి చెన్నై మెమోరీస్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు.దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
కాగా పవన్ కళ్యాణ్ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఆనంద్ సాయితో కలిసి ఇ ఒకే రూమ్ లో నివాసం ఉండేవాళ్ళు.అప్పట్లో ఆనంద్ సాయికి పవన్ కళ్యాణ్ పలుమార్లు ఆర్థికంగా కూడా సహాయం చేసినట్లు ఆనంద్ సాయి పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు.
అంతే కాకుండా తొలిప్రేమ చిత్రంలో పవన్ కళ్యాణ్ చెల్లెలి పాత్రలో నటించిన వసూకి ఆనంద్ తో ఆనంద్ సాయి ప్రేమలో పడటానికి కూడా పవన్ కారణమని కూడా పలు సందర్భాలలో తెలిపాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తెలుగులో “హరి హర వీరమల్లు” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ విలక్షణ దర్శకుడు “క్రిష్ జాగర్లమూడి” దర్శకత్వం వహిస్తున్నాడు.ఆ మధ్య పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్ ని విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.