ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలలో బాగా ట్రోల్ అవుతున్న సాక్రి ఫైజింగ్ స్టార్ “సునిశిత్” అంటే పెద్దగా తెలియని వారు ఉండరు.అయితే తాజాగా సునిశిత్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న “పుష్ప” చిత్రంలో మొదటగా తనకి హీరోగా అవకాశం వచ్చిందని కానీ తానే అల్లు అర్జున్ కోసం ఆఫర్ ని విడిచిపెట్టినట్లు సంచలన వ్యాఖ్యలు చేసి మరోమారు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురయ్యాడు.
దీంతో ఇంటర్వ్యూ చేసినటువంటి యాంకర్ అసలు విషయం కనుక్కోవడానికి పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ అసిస్టెంట్ కి ఫోన్ చేశాడు.దీంతో సుకుమార్ అసిస్టెంట్ ఈ విషయం గురించి మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా సునిశిత్ సినిమాలపై ఉన్నటువంటి మక్కువ కారణంగా అవకాశాల కోసం తెగ ప్రయత్నిస్తున్నాడని కాబట్టి అతడిని ఎంకరేజ్ చేసేందుకు ఓ చిన్న పాత్రలో అవకాశం ఇవ్వడానికి అతడికి ఫోన్ చేశామని, కానీ సునిశిత్ తమ ఫోన్ ఎత్తకపోవడంతో ఆ అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇచ్చినట్లు తెలిపాడు.
దీంతో సునిశిత్ గురించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు.అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సునిశిత్ కి మతిస్థిమితం సరిగా లేదని అందువల్లనే టాలీవుడ్లోని హీరోలు మరియు హీరోయిన్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా గతంలో కూడా తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన “నేనొక్కడినే” చిత్రంలో తనకి హీరోగా అవకాశం వచ్చిందని కానీ మహేష్ బాబు కోసం ఆ ఆఫర్ ని త్యాగం చేసినట్లు చెప్పుకొచ్చాడు అంతేగాక తాను కొద్దిరోజులు ఈ చిత్ర షూటింగ్ లో కూడా పాల్గొన్నానని ఆ మధ్య ఏకంగా ఓ పోస్టర్ ని కూడా ఫ్రూప్ గా చూపించాడు.కానీ మహేష్ బాబు అభిమానులు మాత్రం సునిశిత్ ను ఫన్నీ ట్రోల్స్ తో బాగానే ఆడుకున్నారు.అలాగే ఆ మధ్య సునిశిత్ ఏకంగా అందాల రాక్షసి మూవీ ఫేమ్ లావణ్య త్రిపాఠి తన భార్యని గుట్టుచప్పుడు కాకుండా గుడిలో పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో లావణ్యత్రిపాఠి పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్టు చేయించింది.అయినప్పటికీ సునిశిత్ మాత్రం ఏమాత్రం మారకుండా ఎప్పుడూ ఏదో ఒక విషయంపై కాంట్రవర్సీలు చేస్తూనే ఉన్నాడు.