సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకునే నటులు కొంతమంది మాత్రమే ఉంటారు.అందులో చాలామంది నటులు సినిమాలు తీస్తున్నమా అంటే తీస్తున్నాము అనే ఉద్దేశ్యం తోనే సినిమాలు చేస్తారు.
తప్ప వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ అయితే ఉండదు.ఇక ఇలాంటి క్రమంలోనే అలాంటి వారు చేసే సినిమాలు పెద్దగా గుర్తింపు పొందవు అలాంటి వాళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.
కొంతమంది మాత్రం వాళ్ళు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకోవడానికే సినిమాలు చేస్తూ ఉంటారు అలాంటి వారిలో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ఒకరు.
ఈయన చేసిన అర్జున్ రెడ్డి( Arjun Reddy ) సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరో అయిపోయాడు.అయినప్పటికీ ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండే విధంగా చూసుకుంటాడు… ఇక ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో చేసిన లైగర్ సినిమాతో( Liger Movie ) భారీ ఫ్లాప్ ను అందుకోవడంతో ఆయన ఇమేజ్ అనేది చాలా వరకు డ్యామేజ్ అయింది.ఈ సినిమా ప్లాప్ అవగానే ఆయనతో ఇంతకుముందు సినిమా చేస్తానని కమిట్ అయిన సుకుమార్( Sukumar ) లాంటి స్టార్ డైరెక్టర్ సైతం సినిమా నుంచి తప్పుకున్నాడు.
ఎందుకంటే సుకుమార్ కి ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో మంచి మార్కెట్ అయితే ఉంది.ఇక ఇలాంటి టైం లో సుకుమార్ విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తే ఆయన మార్కెట్ మళ్లీ డౌన్ అయిపోతుందేమో అనే ఉద్దేశ్యం తోనే ఆయన విజయ్ తో సినిమాని క్యాన్సిల్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇప్పుడు సుకుమార్ పుష్ప 2 తో( Pushpa 2 ) మంచి విజయాన్ని అందుకొని పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ కొట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు…
.