Sriya Reddy: నాకు ఫుడ్ పంపించద్దు అని ప్రభాస్ కి వార్నింగ్ ఇచ్చాను : శ్రీయ రెడ్డి

సలార్ సినిమా( Salaar movie ) తర్వాత శ్రీయ రెడ్డి( Sriya Reddy ) సోషల్ మీడియా సెన్సేషనల్ గా మారిపోయింది.చాలా ఏళ్ళ క్రితం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు మరో శివగామిలా అరుదైన పవర్ఫుల్ విలని పాత్రలో అద్భుతంగా నటించింది అంటూ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి నీరాజనాలు అందుకుంటుంది.

 Sriya Reddy About Prabhas Food-TeluguStop.com

అయితే ఈ అమ్మడు ఇటీవల కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా మొదలు పెట్టింది.సలార్ తెచ్చిన క్రేజ్ తో మరికొన్ని సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతోంది.

అయితే సలార్ లో స్టార్ క్యాస్ట్ పక్కన నటించిన శ్రీయ రెడ్డి వారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను సోషల్ మీడియాతో పంచుకున్నారు.అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Prabhas, Prashanth Neel, Salaar, Sriya Reddy, Tollywood-Movie

మామూలుగా ప్రభాస్( Prabhas ) అంటేనే భోజనం పెట్టి చంపేస్తాడు అనే వార్త సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటుంది.ఏ సెలబ్రిటీ అయినా కూడా ప్రభాస్ గురించి చెప్పాల్సివస్తే ఆయన పెట్టే తిండి గురించి మాట్లాడుతారు.మొన్నటికి మొన్న సలార్ ఇంటర్వ్యూ సందర్భంగా పృథ్వీరాజ్ సుకుమారన్ ( Prithviraj Sukumaran )సైతం ప్రభాస్ పంపించిన ఆహారం కోసం ఇంకొక రూమ్ ఎక్స్ట్రాగా బుక్ చేసుకోవాల్సి వచ్చిందంటూ నవ్వులు పూయించారు.ఈ విషయం గురించి శ్రీయ రెడ్డిని ఒక ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించగా ఈ విషయం తనకు ముందే తెలుసు అని ప్రభాస్ అందరిని తిండి పెట్టి చంపేస్తాడని వార్త ఎప్పటి నుంచో ఉందని కానీ నేను ఫిట్నెస్ ఫ్రీక్ అని అసలు తినడం వంటివి చేయను అని ముందే ప్రభాస్ కి గట్టిగా చెప్పానంటూ చెబుతున్నారు శ్రీయ రెడ్డి.

Telugu Prabhas, Prashanth Neel, Salaar, Sriya Reddy, Tollywood-Movie

సలార్ షూటింగ్ టైంలో తనకి ఇష్టమైన ఆహారం ఏంటి అని ప్రభాస్ అడిగాడని తను ఏమీ తిననని, డైట్ చేస్తానని బాగా వర్కౌట్ కూడా చేస్తానని తెలిపారట.ఏదో ఒక పదార్థం పేరు చెప్పాలని ప్రభాస్ బలవంత పెట్టడంతో తనకు స్వీట్స్ అంటే ఇష్టం అని చెప్పిందట.అయితే స్వీట్స్ పంపిస్తాను అని ప్రభాస్ అడగగా ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ సినిమా షూటింగ్లో ఉన్నన్ని రోజులు నాకు ఎలాంటి ఫుడ్ ప్రభాస్ పంపించకూడదు అంటూ అతడికి స్వీట్ గా వార్నింగ్ ఇచ్చిందట.దాంతో ఆమె ప్రభాస్ ఫుడ్ నుంచి తప్పించుకున్నానని సరదాగా చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube