ఏపీలో జనసేన కీలక సమావేశాలు నిర్వహించనుంది.ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.
ఇందులో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్ తో పాటు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు.టీడీపీతో పొత్తు నేపథ్యంలో రాష్ట్రంలో జనసేన పోటీ చేసే స్థానాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే విశాఖ, తూర్పుగోదావరి, ప్రకాశం, కృష్ణా మరియు అనంతపురం జిల్లాల నాయకులతో భేటీ కానున్నారు.నేతలతో చర్చలు ముగిసిన అనంతరం జనసేన ఎన్ని స్థానాల్లో బరిలో దిగనుందనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అలాగే జనసేన పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపైనా ఈ సమావేశాల్లో సమాలోచనలు చేయనున్నారని సమాచారం.